రెండేళ్ల క్యాలెండర్ ని ఫిల్ చేసిన రెబల్ స్టార్

28 Feb, 2020 - 03:02 PM

బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రభాస్ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. కేవలం హిందీలోనే ఈ సినిమా దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసి అందిరీని ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాల్లో సాహూ ఇచ్చిన షాక్ నుంచి బయటపడ్డ ప్రభాస్ ప్రస్తుతం… రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్… నలుగురు దర్శకులను లైన్‌లో పెట్టాడట. కొరటాల శివ చెప్పిన స్టోరీ లైన్ కు ప్రభాస్ ఇంప్రెస్స్ అయి ఒకే చెప్పినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాలతో సినిమా పూర్తి అవగానే అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఒక మూవీ చేయనున్నాడని సమాచారం. దీంతో పాటు ఇప్పటికే ప్రభాస్… మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న నాగ్ అశ్విన్ తో మూవీ అనౌన్స్ కూడా చేశాడు.

prabhas

అల వైకుంఠపురం తో బన్నీకి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో కూడా సినిమా లైన్ లో పెట్టే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా ప్రభాస్.. నితిన్‌తో ‘భీష్మ’ వంటి ఎంటర్టైనర్ తీసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు ఫిలిం నగర్ సమాచారం. రీసెంట్‌గా వెంకీ కుడుముల ప్రభాస్‌ను కలిసి తన దగ్గర ఉన్న ఒకస్టోరీ లైన్ చెప్పాడట. ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పూర్తి మాస్ అండ్ క్లాస్ రోల్స్ చేసిన ప్రభాస్, వెంకీ కుడుముల దర్శకత్వంలో పూర్తి కామెడీ ఎంటర్టేనర్ సినిమా చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొత్తానికి బాహుబలి, సాహులతో ఏడేళ్లు టైం స్పెండ్ చేసిన ప్రభాస్, 2020-2021 క్యాలెండర్ లో నలుగురి డైరెక్టర్స్ తో బిజీ అవడానికి రెడీ అవుతున్నాడు.