NewsOrbit

Month : May 2020

ట్రెండింగ్

సైలెంట్ అయ్యారు ఏంటి చిరు సారు??  దూకుడు ఆగిందా ? 

siddhu
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఆరంగేట్రం చేసిన తర్వాత తన మనసుకు నచ్చినట్లు సరదాగా మరియు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఎన్నో ట్వీట్లు వేశారు. తనతో పనిచేసిన నటీనటులు అందరితో సరదాగా ట్విట్టర్లోనే కొద్దిరోజులు కాలక్షేపం చేశారు కూడా. అయితే ఇప్పుడు మెగాస్టార్ కి అసలైన పరీక్ష మొదలైంది. బాలయ్య ఆయనను పరోక్షంగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి సోషల్ మీడియాలో గట్టిగా స్పందించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య కు గట్టి కౌంటర్లు ఇవ్వగా అది కూడా సరిపోలేదని అందరి భావన. ఇదిలా ఉండగా.. సామాజిక మాధ్యమం లో పరిస్థితి ఎలా ఉంటుందో చిరంజీవికి ఇంకా పూర్తిగా తెలిసి రాలేదు. అతను ట్విట్టర్ వంటి మీడియం లోనికి అడుగుపెట్టాక ఎదురైన తొలి పరీక్ష ఇది. చిరంజీవి ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరం. ఏదైనా విషయం గురించి క్లారిటీ ఇవ్వవలసి వస్తే ప్రెస్ నోట్ తరహాలో ఒక చిన్న సందేశం విడుదల చేసేవారు. కొన్నిసార్లు చిరు పేరిట నకిలీ ప్రెస్ నోట్లు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఓ రేంజ్ లో గందరగోళం నడిచింది కూడా. అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు చిరంజీవి సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఈ వివాదం పై అతని అంతరంగం ఏమంటుందో పూర్తి స్పష్టత వచ్చేస్తుంది ఒక పక్క మెగా మరియు నందమూరి ఫాన్స్ సోషల్ మీడియా విపరీతంగా తిట్టుకుంటే ఈ సందర్భంలో చిరంజీవి రియాక్ట్ అవుతారో లేదా అనే విషయంపై సందిగ్థత నెలకొంది. ఇకపోతే చిరంజీవి మరియు బాలకృష్ణ మంచి స్నేహితులు. కానీ ఇప్పుడు ఏకంగా తనపైన బాలకృష్ణ అభాండాలు వేశారు. భూములు పంచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేయడంతో పాటు ‘బీప్’ పదాన్ని కూడా వాడటం గమనార్హం. దీనిపై గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున వివాదం నడుస్తూనే ఉంది. ఇ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే చిరంజీవి రియాక్ట్ అవ్వక తప్పదు అని కొందరి భావన. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో తనతో మాట్లాడిన ప్రతి ఒక్క ప్రముఖుడికి తగిన సమాధానం ఇచ్చిన చిరంజీవి ఒక్కసారిగా సైలెంట్ ఎందుకు అయ్యాడు అన్న విషయంపై ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఇప్పటికైనా ఆయన ఈ విషయంపై ఏదైనా ట్వీట్ పెడతారా లేదా సైలెంట్ గా ఊరుకుంటారా అని ప్రశ్న అందరి మెదడుని తొలుస్తోంది....
ట్రెండింగ్

సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ – కథ గురించి చెబుతున్న సీక్రెట్ ఇదే? 

siddhu
టాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 27వ సినిమా, ‘సర్కారు వారి పాట’ యొక్క క అనౌన్స్మెంట్ నేడు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు ను పురస్కరించుకుని జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంతకు ముందే లీక్ అవ్వగా చిత్రబృందం నేడు అధికారికంగా ఖరారు చేస్తూ మహేష్ బాబుని ఒక ఊర మాస్ లుక్ లో చూపిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి మహేష్ బాబుతో సహా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి సంయుక్తంగా నిర్మించనునారు. టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లుక్ విషయానికి వస్తే మహేష్ ను ఈ పోస్టర్ లో పూర్తిగా చూపించలేదు కానీ వెనక వైపు నుండి సగం లుక్ ని ఓపెన్ చేశారు. ఒక చెవికి రింగు పెట్టుకొని ఉన్న మహేష్ రఫ్ గా కనిపించే గడ్డంతో.. బ్లాక్ షర్టు తో.. ఫ్రీ హెయిర్ స్టైల్ తో మాసీ గా కనిపిస్తున్నాడు. మహేష్ బాబు ని ఇటువంటి మాస్ లుక్ లో చివరిగా ప్రేక్షకులు చూసింది పోకిరి మరియు అతిథి సినిమాల్లోనే. వీటన్నింటికి తోడు టైటిల్ పరమార్థాన్ని ప్రతిబింబించేలా అతని మెడపై రూపాయి అభిమానులను ఉర్రూతలూగించింది. టైటిల్ కు, ఆ పాత రూపాయి బిళ్ళ టాటూకి మరియు కథకు చాలా గట్టి సంబంధమే ఉందని అందరూ భావిస్తున్నారు ఇక మహేష్ ఈ చిత్రంలో మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని  ప్రచారమవుతోంది. యంగ్ కాలేజ్ బోయ్ లుక్ తో పాటు.. రకరకాల ఏజ్ లలో డిఫరెంట్ లుక్ తో ట్రీటిస్తాడని మహేష్ అభిమానుల్లో ప్రచారమవుతోంది. అందుకు తగ్గట్టే ఈ లుక్ యంగ్ ఏజ్ కి సంబంధించినది అని అర్థమవుతోంది. తమన్ సంగీతం.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్ త్రిపాత్రాభినయం పోషించనున్నారనే వార్తలపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది...
5th ఎస్టేట్ న్యూస్

ఈనాడు మెడలో “నమో” భజన బోర్డు…!

Srinivas Manem
  “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించే గాక” ఇది ఈనాడు పత్రిక ఉప శీర్షిక. ఆ సత్యాలేమిటో కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఒక రంగునీ, ఒక పార్టీని మెడలో వేసుకుని కళ్ళు మూసుకుపోయి చెప్పే ఆ...
ట్రెండింగ్

తొందరపడుతున్న నిమ్మగడ్డ – పెద్ద సవాల్ రానుంది? 

siddhu
  నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొట్టమొదటిసారి 2016లో ఎస్ఈసీ గా   నియమితుడైన నిమ్మగడ్డ యొక్క...
న్యూస్

చంద్రబాబుపై నందిగామలో కేసు ఎందుకు బుక్ చేసారంటే..!

sharma somaraju
అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు అయింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ నుండి విజయవాడ కు...
5th ఎస్టేట్ న్యూస్ రాజ‌కీయాలు

ఒక ఎమ్మెల్యే – అనేక ట్విస్టులు …!

Srinivas Manem
ఆయన పార్టీ మారతారట – పుకారు (మే 10 నుండి 20 మధ్య) అవును ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోతున్నారు – ప్రచారం (మే 20 నుండి 24 మధ్య) ఈనెల 27 న...
న్యూస్

బాబుకు హెచ్చరిక: 2019<2024... 2019>2024?

CMR
చంద్రబాబు రాజకీయాన్ని కరోనా ముందు, కరోనా తర్వాతా అని విభజించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్న దశ ఇది! ఎలాంటి బాబు ఎలా అయిపోయారు? అసెంబ్లీలోనూ, బయటా మహా మహులను ఎదుర్కొన్న బాబు.....
న్యూస్ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు 27 వ చిత్రం “సర్కారువారి పాట” ..!

GRK
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ ఇయర్ ప్రారంభంలోనే భారీ హిట్ ని దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించే లేటెస్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో...
న్యూస్

కరణం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ -ఏడుగురికి గాయాలు -రామాపురంలో ఉద్రిక్తత

sharma somaraju
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో విచిత్రమైన రాజకీయ...
ట్రెండింగ్

ఈ ఆరు ప్రదేశాలకు వెళ్తే కరోనా వచ్చే  రిస్క్ ఎక్కువట…! తస్మాత్ జాగ్రత్త 

siddhu
ప్రపంచం మొత్తాన్నీ పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మానవ జాతి మీద ప్రస్తుతం చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. దేశాలకు దేశాలే లాక్ డౌన్ ను విధించుకుని బయటకు రాకుండా ఇళ్ళలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం త్వరలోనే ఈ వ్యాధిని నివారించేందుకు తగిన మందులు లేదా వ్యాక్సిన్ కనిపెట్టకపోతే కనీసం రెండు సంవత్సరాలు ఈ వైరస్ సహజీవనం చేస్తోంది. ఇదిలా ఉండగా లాక్ డౌన్ 4.0 కింద ఇచ్చిన సడలింపులతో ప్రజల్లో భయం తొలగిపోయి రోడ్లమీద అంతా తమ ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉండటం కూడా మనం రోజు గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆరు ప్రదేశాలు మాత్రం కరోనా వ్యాప్తికి పూర్తిగా సహకరిస్తాయి అని నిపుణులు చెప్పారు. అవేంటో ఒక సారి చూసి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1. వివాహాలు – సాధారణంగా వివాహాలకు రకరకాల ప్రదేశాల నుండి ఎంతో మంది జనం వస్తుంటారు. ఎన్ని ఆంక్షలు విధించినా లాక్ డౌన్ వంకతో విచ్చేసే సభ్యులను కుదించినా…. అక్కడ సామాజిక దూరం పాటించడం మాత్రం అసంభవం. ఒకరితో ఒకరు ఆరు అడుగుల దూరంలో ఉండి అక్షింతలు వేయడం మరియు పెళ్లి కావాల్సిన జంట మరియు వారి సన్నిహితులు, తోబుట్టువులు దూరం దూరంగా ఉండి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగే పని అయితే కాదు. కాబట్టి నిపుణులు వివాహ వేడుకలు జరిగే కళ్యాణ మండపాలు మరియు స్థలాలను రిస్క్ జోన్లగా గుర్తించారు. మరీ ముఖ్యంగా వీటిలో పెళ్లైన జంటకు కరోనా ప్రమాదం ఉందని తేల్చి చెప్పారు. 2. ఇళ్లలో జరిగే మతపరమైన కార్యక్రమాలు – ఇప్పుడంటే లాక్ డౌన్ వల్ల ఆలయాలు, చర్చిలు మరియు మసీదులు తెరుచుకోవడం లేదు కానీ ఇళ్ళలో ఇప్పటికీ కొంతమంది అతి తక్కువ సభ్యులతో మతపరమైన మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వీటిలో ముఖ్యంగా ప్రార్థన కూడికలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, అన్నప్రాసన్నం వంటివి ఉన్నాయి. వీటివలన ప్రజలు అంతా ఒకచోట గుమిగూడడం వలన ఎక్కువగా కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. 3. మాల్స్ – దాదాపు రెండు నెలలు యావత్ భారతదేశం అంతా షాపింగ్ అన్న పదమే మర్చిపోయింది. అయితే ఇప్పుడు జరుగుతున్న లాక్ డౌన్ పుణ్యమాని నిర్దేశిత సమయంలో షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఇలా షాపింగ్ మాల్స్ లో జనం ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడ కరోనా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వలన మరియు మాల్స్ లో లిఫ్ట్ లో మిగతా వారితో కలిసి ప్రయాణం చేయడం వలన కూడా కరోనా ప్రబలుతుంది కాబట్టి ఇక అనివార్యమైన పరిస్థితుల్లో షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు తమతో కూడా ఒక శానిటైజర్ ను తీసుకుని వెళ్లి తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. 4. సెలూన్ – ఒక రెండు నెలలు బ్యూటీ పార్లర్ లు,  సెలూన్ షాపులు మూసిఉండేసరికి అందరూ ఈ ఎండాకాలంలో గడ్డాలు, మీసాలు పెంచుకొని చిరాకు మీద ఉండే ఉంటారు. అటువంటి సమయంలో తెరిచారు కదా అని సెలూన్ లోకి దూరిపోవడం అంత సురక్షితం కాదని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇంటి దగ్గరే ట్రిమ్మర్, కత్తెర మరియు రేజర్ వంటివాటితో షేవింగ్ మరియు కటింగ్ చేసుకోవడం మంచిది అని వారి సలహా. 5. జిమ్ (వ్యాయామశాల) – నిత్యం తమ శరీరాన్ని దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వ్యాయామశాలలో తెగ ఎక్సర్సైజులు చేసేవారి సంఖ్య ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఒకరు వాడిన పరికరాలను మరొకరు కూడా వాడవలసి ఉండడంతో కరోనా సోకే అవకాశం బాగానే ఉంది. కానీ శానిటైజర్ ను వెంటబెట్టుకుని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటే ఏ కంగారు ఉండదని నిపుణులు చెబుతున్నారు. 6. బీచ్ లు – ఇక ఎండాకాలం మండిపోతున్న సమయంలో తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అలా సరదాగా సాయంత్రం బీచ్ లకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎక్కువమంది జనం లేకపోతే బీచ్ లు సురక్షితం కానీ అందరూ వారిలాగే వచ్చి అక్కడ సేదతీరితే తర్వాత ఆస్పత్రిలో సేదతీరాల్సి ఉంటుంది....
ట్రెండింగ్ న్యూస్

ఎన్‌టి‌ఆర్ – చరణ్ కి భారీ డ్యామేజ్ చేసిన బాలయ్య – నాగబాబు

siddhu
ఈ కరోనా సంక్షోభ సమయంలో ఉన్నట్టుంది ఒక్కసారిగా మెగా-నంద మూరి వార్ మొదలైంది. ఇప్పుడు వారిరువురి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి     వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మొదట బాలకృష్ణ చిరంజీవి ఇంట్లో సినీ...
న్యూస్

బ్రేకింగ్ : జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగింపు .. కానీ ఒక ట్విస్ట్ ఉంది !

Siva Prasad
  కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్న కారణం గా ఇండియా వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 30 వరకూ ఇండియా లాక్ డౌన్ ని పొడిగించారు. కానీ...
న్యూస్

విమానం గాల్లో ఉండగా పైలెట్ కి కరోనా అని ఎయిర్ పోర్టులో రిజల్ట్ వచ్చింది…వెంటనే ఏం చేశారో చూడండి

sharma somaraju
ఒక పక్క కరోనా మహమ్మారి ప్రపంచంలోని దేశాలను వణికిస్తోంది. నేటికి 60 లక్షల 57వేల మందికి పైగా కొవిడ్ 19 వైరస్ బారిన పడగా 3 లక్షల 67 వేల 312 మంది మృతి...
న్యూస్

‘మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం’

sharma somaraju
అమరావతి : ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తున్నానని తొలి నుండి చెబుతున్న వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది..ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చినట్లు స్పష్టం చేశారు....
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ప్రకాశంలో రాజకీయం సర్దుకున్నట్టేనా…!

Srinivas Manem
రెండు రోజుల కిందటి వరకు ప్రకాశం జిల్లాలో ఒకటే చర్చ..! ఒకటే రచ్చ…! చీరాల వైసీపీ ఇంచార్జి ఎవరు…? పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారా లేదా…?? గొట్టిపాటి రవికుమార్ పరిస్థితి ఏంటి.....
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుని మరోసారి ఆడేసుకున్న ఆమంచి

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ మరోసారి సారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
న్యూస్

రాత్రి పెళ్ళాం బయటకు గెంటేసింది-తెల్లారితే శవం అయ్యాడు

sharma somaraju
రాత్రి భార్య భర్త గొడవ పడ్డారు. భర్త అలిగి ఆరుబయట పడుకున్నాడు. ఉదయానికి విగత జీవుడయ్యడు. ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే విషయాలు పోలీస్ దర్యాప్తులో తెలవలసి ఉంది. ఈ...
న్యూస్ బిగ్ స్టోరీ

అన్నీ బ్యాడ్ న్యూస్ ల మధ్యలో జగన్ సర్కార్ కి సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హై కోర్టు !

siddhu
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం హైకోర్టులో అట్టర్ ఫ్లాప్ అవుతోంది. దీంతో వైయస్ జగన్ కి అసలైన ప్రతిపక్షం రాజకీయ పార్టీలు కాదని హైకోర్టు అంటూ నెటిజన్ల...
బిగ్ స్టోరీ

కూతురు – మేనల్లుడు అలా చేయడం చూసిన మామ స్పాట్ రియాక్షన్ ఇదే !

siddhu
సమాజంలో రోజురోజుకీ మానవ విలువలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. టెక్నాలజీ పుణ్యమో లేకపోతే సినిమాల పుణ్యమో తెలియదుగానీ మనిషి ఆలోచనలు మృగం కంటే హీనంగా మారుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు కూడా బిడ్డలను అలానే పెంచుతున్నారు. ఎవరైనా...
బిగ్ స్టోరీ

జగన్ కే ఎందుకులా జరుగుతోంది – సీక్రెట్ కారణం ఇదేనా ?

siddhu
జగన్ రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. 2009 ఎన్నికల్లో జగన్ ఎంపీ అవటం ఆలస్యం తండ్రి వైయస్ చనిపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక...
బిగ్ స్టోరీ

మహానాడు పూర్తయిన 24 గంటల్లోనే చంద్రబాబు కి ఊహించని వార్త!

siddhu
  సాధారణంగా ప్రజల ప్రయోజనాలు మరియు వారి అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పని చేయాలి. అంతేకానీ కక్ష సాధింపు చర్యలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే సభల వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కానీ నయాపైసా ఉపయోగం కూడా ఉండదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కి అర్ధం కానట్లుంది. ప్రతి సంవత్సరం టిడిపి నిర్వహించుకునే ‘మహానాడు’ ఈసారి డిజిటల్ మహానాడు గా జరిగిన విషయం తెలిసిందే. సాధారణంగా మూడు రోజులు జరిగే మహానాడుని కరోనా ప్రభావం వల్ల రెండు రోజులకే కుసించారు. ప్రతి సంవత్సరం అయితే ఈ మహానాడు లో పార్టీ లోని లోపాలు మరియు పార్టీ కేడర్ ను పటిష్టం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు చర్చిస్తారు. కానీ ఈసారి మహానాడు అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. జరిగిన రెండు రోజులు కూడా కేవలం జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోయడానికే సమయం మొత్తాన్ని ఉపయోగించారు. చంద్రబాబు ఈసారి వారి నాయకుల మధ్య జరిగిన చర్చలు మరియు చేసుకున్న తీర్మానాల తీరు విచిత్రంగా ఉంది. రెండు రోజులు జరిగిన ప్రసంగాలు అన్నీ జగన్ చుట్టూ తిరగడం మరియు చంద్రబాబు గత పాలనను పొగడటం…. జగన్ చేస్తున్న ప్రస్తుత పాలనపై బురద చల్లడంతోనే కాలం గడిచిపోయింది. సరే ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపడంలో తప్పేముంది అని అనుకుందా…. అయితే ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలకు ఇక్కడ జగన్ ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం? మహానాడు జరిగిన 24 గంటల్లో బయటకు వచ్చిన రిపోర్టులను పరిశీలిస్తే చంద్రబాబు కి పెద్ద షాక్ తగిలింది అనే చెప్పాలి. ఈసారి మహానాడు అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోగా ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు మరియు ప్రతిపక్షాలు చేసిన రచ్చ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక అన్నదాత వెన్నువిరవటం గురించి కూడా తప్పుడు ఆరోపణలు, కథనాలే రాయిస్తున్నారు అని రిపోర్టులు తేల్చి చెప్పేశారు. ఇక రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశారు అన్నదానికి ఆధారాలు లేవు కానీ అధికార పార్టీ మాత్రం నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేయడం ఇంకా ఏడాది కాకుండానే రెండుసార్లు అకౌంట్లోకి నగదు జమ చేసిన తీరు ఇప్పుడు బాబు అన్న మాటలను నవ్వులపాలు అయ్యేలా చేసింది. ఇదిలా ఉండగా కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం పంటలను పొలాల దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసింది. ఇన్ని సానుకూలాంశాల మధ్య మరలా సాగునీటి ప్రాజెక్టులు సంక్షోభంలో పడ్డాయి అవాస్తవ ప్రచారానికి మహానాడుని ఉపయోగించుకున్న తీరు రిపోర్ట్ లో స్పష్టంగా కేంద్రీకృతమైంది. కరోనా సంక్షోభం కారణంగానే పోలవరం తదితర ప్రాజెక్టుల పనులు ఆగాయని బాబు తెలుసుకోలేని తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానో లేకపోతే ప్రభుత్వాన్ని నిందించటానికి, బురద చల్లటానికే మహానాడు పరిమితం కాకుండా ఆత్మ పరిశీలన కూడా చేసుకునుంటే బాగుండేది.. లేకపోతే ఇటువంటి మహానాడులు ఎన్ని జరుపుకున్నా ఉపయోగం ఉండదని చంద్రబాబు గ్రహించాలి....
సినిమా

జ్యోతిక కొత్త సినిమా రివ్యూ…. చూడచ్చా?అక్కర్లేదా?

sharma somaraju
నటీనటులు: జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్ నిర్మాత: సూర్య దర్శకత్వం: జేజే ఫెడ్రిక్ రన్ టైం: 2 గంటల 3 నిముషాలు విడుదల తేదీ: మే 29, 2020 ఓటిటి ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్...
న్యూస్

అర్దరాత్రి రెండున్నరకి.. పెళ్ళాం మీద అనుమానంతో తలుపు తీసి ఒక్క పోటు పొడిచాడు

sharma somaraju
భార్యపై అనుమానం అతనిని హంతకుడిని చేసింది. ఓ యువకుడు తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న కోపం అతనిలో క్రోధంగా మారి హత్య చేసేందుకు ప్రేరేపించింది. సంచలనం కల్గించిన ఈ ఘటన తూర్పు గోదావరి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగనూ… సెంచరీ కొట్టకు.., చట్టాలతో స్నేహం చెయ్..!

Srinivas Manem
ఒక అనాలోచితం…, ఒక అనుభవ రాహిత్యం…, ఒక దూకుడు మనస్తత్వం.., ఒక ముక్కుసూటి వ్యక్తిత్వం.., సీఎం కుర్చీ ఎక్కితే ఎన్ని కష్టాలు వస్తాయో సీఎం జగన్ ని చూస్తే తెలుస్తుంది. పాపం 156 లక్షల...
సినిమా

చిరంజీవికి జగన్ బంగారం లాంటి వార్త

sharma somaraju
తెలుగు సినీ పరిశ్రమను లీడ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారం లాంటి వార్త అందించినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు...
బిగ్ స్టోరీ

టాప్ మినిస్టర్ కి జగన్ క్లాస్… నిఘా పెట్టి మరి నిజాలు లాగిన సి‌ఎం?

siddhu
అవకాశం దొరకాలే కానీ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్న తమ చేతిలో పదవి మరియు అధికారం ఉంటే అవినీతి సొమ్ముని సంపాదించుకునేందుకు వెనుకాడరు. అసలు అలాంటి ఉద్దేశం లేని నాయకుడు ఒక రాజకీయ నాయకుడే కాదు అనే రేంజ్ లో నేటి తరం నాయకులు బ్రతుకుతున్నారు. ఈ విషయానికి ఎవరూ అతీతులు కాదు అన్న విషయం యావత్ ప్రజానీకం గుండెల్లో బలంగా పాతుకుపోయింది. పార్టీ అధినేత తమను పట్టించుకోకపోతే చాలు…. నాయకులు అవకాశం వెత్తుక్కొని మరీ చెలరేగిపోతారు.. దొరికిన కాడికి దోచేసుకుంటారు. ఫలితంగా అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా పాకుతుంది. గతంలో అవినీతి నేతలను మొదట్లో కంట్రోల్ చేసిన చంద్రబాబు చివరి రెండేళ్ళలో పూర్తిగా చేతులెత్తేయడమే ఆ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడానికి గల కారణాల్లో ఒకటిగా నిలిచింది అని పలువురు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. మరి పరిస్థితి అలా జరిగితే ఒక్క తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న ఏ పార్టీ అయినా మట్టికొట్టుకునిపోవడం ఖాయం. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి జగన్ అటు అధికారులతో పాటు ఇటు సొంత ఎమ్మెల్యే లను మరియు మంత్రులను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో రాజకీయ నాయకుల స్వభావంపై ఎటువంటి నమ్మకం లేని జగన్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మరియు రూల్స్ ఎంత కఠినం చేసినా అనివార్య పరిస్థితుల్లో పరిస్థితి తప్పు దారి పట్టే ప్రమాదం ఉందని గమనించిన ఆయన పురపాలక శాఖ శాఖ, ఎక్సైజ్ శాఖ, పౌరసరఫరాల శాఖ, గ‌నుల శాఖ‌ వంటి కీలక శాఖల పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ రిపోర్టు కూడా తీసుకుంటున్నారని గతంలోనే వైసీపీలో చర్చకు వచ్చింది. ఇక మహిళా మణులు మంత్రులుగా శాఖల్లో వారి భర్తలు చక్రం తిప్పుతున్నారు అని జగన్ కు సమాచారం అందింది. అయితే తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి విషయంలో ఇదే జరిగే సరికి జగన్ సదరు మినిస్టర్ కి గట్టిగానే క్లాస్ పీకారన్న ప్రచారం తాజాగా వెలుగు చూసింది. బదిలీలు, ప్రమోషన్లు విషయంలో అతని చేతులు టేబుల్ కిందకి వెళ్లాయని మరియు దీనికి సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో జగన్ ఇక జోక్యం చేసుకోక తప్పలేదని వైసిపి వర్గాల్లో ఈ విషయం మారుమోగుతుంది. ఇదే విధంగా మిగిలిన శాఖల్లోనూ ఇదే తరహాలో కొన్ని ఫిర్యాదులు అందాయని వారికి కూడా జగన్ చాలా గట్టిగా క్లాస్ పీకిన ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనకు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని తీసుకుని వచ్చి ఆయా శాఖలకు పీఆర్వో లుగా, ముఖ్య కార్యదర్శులుగా నియమించి ఎటువంటి అవినీతి జరిగేందుకు వీలు లేకుండా జగన్ చేసేశారట. దీంతో స‌ద‌రు మంత్రులు ఇప్పుడు అడుగు ఎటు తీసి ఎటు వేయాల‌న్నా కూడా హ‌డ‌లి పోతున్నార‌ని, వారు ఏం చేసినా క్షణాల్లోనే జ‌గ‌న్‌కు స‌మాచారం వెళ్తోంద‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు మంత్రుల శాఖ‌ల‌కు సంబంధించి స‌మీక్షలు కూడా నేరుగా సీఎం చేసే ప‌రిస్థితి ఉందంటున్నారు...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

సుప్రీమ్ కా… కేంద్రానికా..? జగన్ మదిలో ఏముంది..? (న్యూస్ ఆర్బిట్ మార్కు విశ్లేషణ)

Srinivas Manem
ఇప్పుడేం చేయాలి..? కేంద్రం వద్దకు వెళ్లి బతిమలాడుకోవాలా…?? సుప్రీం కి వెళ్లి పంతానికి పోవాలా…?? నిమ్మగడ్డతో రాజీకి వెళ్ళాలా…? అసలు నిమ్మగడ్డ ఉన్నంత వరకు స్థానిక ఎన్నికలు ఆపెయ్యాలా…??? ఏం చేయాలి? జగన్ ఆలోచనలు...
న్యూస్

బిగ్ బ్రేకింగ్ : నిమ్మగడ్డని వెనక్కి తీసుకోండి – హై కోర్టు ఆదేశం

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి జగన్ అప్పట్లో తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక...
న్యూస్

జూన్ 6, 7తేదీల నాటికి రాయలసీమకు నైరుతి రుతుపవనాలు

sharma somaraju
హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ‘చల్లని’ కబురు అందించింది. జూన్‌ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది. వాతావరణం అనుకూలిస్తే...
న్యూస్

ఏపి బీజేపీ నేత కన్నా కోడలు అనుమానాస్పద మృతి

sharma somaraju
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక అనుమానాస్పదంగా మృతి చెందారు. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుహారిక అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన రాయదుర్గం...
5th ఎస్టేట్

జగన్ చేసే పనులకి చంద్రబాబు  సెటైర్ అద్దిరింది గురూ ! 

siddhu
తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని సంపాదించేందుకు మహానాడు ని ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే.లాక్ డౌన్ కారణంగా నేరుగా పార్టీ కార్యకర్తలతో మరియు నాయకులతో భేటీ కాలేని చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లోనే మహానాడు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దానిని వాయిదా వేద్దాం అనుకుంటే సరిగ్గా జగన్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయిన కారణంగా అతని పార్టీని ఎత్తిపొడవడానికి ఇదే సరైన సమయం అని బాబు భావించి ఎట్టిపరిస్థితుల్లో మహానాడుని నిర్వహించాలి అని ఫిక్స్ అయ్యారు. అయితే పార్టీ ప్రక్షాళన విషయంపై ఫోకస్ చేయడం మానేసి జగన్ సర్కార్ ని ఆడిపోసుకునే<దుకే నేతలు ఎక్కువగా ఇక్కడ సమయం వెచ్చించడం గమనార్హం. ఇదిలా ఉండగా జగన్ ప్రభుత్వం పై వెటకారంగా వ్యాఖ్యలు చేసేందుకు ఎప్పుడూ ముందు ఉండే చంద్రబాబు ఈసారి అదే శైలిలో జగన్ ను ‘ది జంగిల్ రాజ్’ అని సంబోధించడం గమనార్హం. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చేసిన విమర్శలు ఈసారి కొద్దిగా ఘాటుగా ఉన్నాయి.  అధికారంలోకి వచ్చిన మొదట్లో ప్రజా వేదికను కూల్చేసిన జగన్ తాజాగా జరిగిన మూడు లాంతర్ల స్థంభాల వరకు అనేక కూల్చివేతకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఎద్దేవా చేశారు. జగన్ కి జంగిల్ రాజ్ అన్నా పేరుని ఒక కౌంటర్ గా సిద్ధం చేసుకున్న చంద్రబాబు అతని  సంవత్సరపు పాలనను ఉదాహరణగా చూపిస్తూ అతనికి ఈ పేరు పెట్టానని వివరించారు....
న్యూస్

‘కేంద్రానికి మన అవసరం ఉంటుంది:భవిష్యత్ లో ప్రత్యేక హోదా ఖాయం’

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని, ఇవాళ కాకపోతే రేపు...
5th ఎస్టేట్

చంద్రబాబు తన ఫోన్ నుంచి డయల్ చేసినా ఎత్తని ఎమ్మెల్యే…!

siddhu
చాలా రోజులు గ్యాప్ తర్వాత బాబు రాష్ట్రం లోకి ప్రవేశించిన వెంటనే వైసీపీ పై ఎదురు దాడి చేసేందుకు మహానాడు ని తల పెడుతున్న ప్రస్తుతం వారి పార్టీలో ఉన్న 23 ఎమ్మెల్యేల లో ఎంతమంది ఉంటారో ఎంతమంది జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇక మహానాడు సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే చాలా యాక్టివ్ గా పాల్గొనవలసి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్లాన్స్ పైన చర్చ మరింత జోరందుకుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వంటివారు తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీ చెంతకు చేరారు. ఇప్పుడు వారితో పాటు మరో ముగ్గురు లైన్ లో ఉన్నారని వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అంతెందుకు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా ఛానల్స్ లోనే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారు అంటూ ఖచ్చితమైన వార్తలు వస్తున్నాయి. పేపర్లలో అయితే కథనాలు బలంగా వినిపిస్తున్నారు. వారిలో ఒకరు ప్రకాశం జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కాగా మరొకరు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా జగన్ చెంతకు చేరనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే వీరందరిలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అయితే పార్టీలోని చాలా కీలక వ్యక్తి. ఈ న్యూస్ తెలుసుకున్న వెంటనే టిడిపి అధినేత రంగంలోకి దిగి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఏలూరు సాంబశివరావు మరియు గొట్టిపాటి రవి వారి నిర్ణయాలను మార్చుకునే ఛాన్సులు ఉన్నా కూడా సత్య ప్రసాద్ విషయంలో మాత్రం చంద్రబాబు ఏం చేయలేకపోతున్నారు అని తెలుస్తోంది. పార్టీలో మహానాడు ప్రారంభించిన నేపథ్యంలో ఇతర నాయకులలో ఉన్న జోష్ అనగాని లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఏకంగా చంద్రబాబు గారు మహానాడులో పాల్గొనేందుకు అనగాని కి స్పెషల్ ఫోన్ కాల్ చేసినా కూడా ఆయన స్పందించే పరిస్థితి లేదు అంటే విషయం అర్థం చేసుకోవచ్చు ఇక అటువైపు నుండి జగన్ కూడా సత్యప్రసాద్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారని వైసిపి వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే రేపల్లె నుండి వైసిపి నాయకుడిగా మోపిదేవి రమణ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోని బలమైన నాయకుడిగా ఉన్న అనగానిని వైసీపీ వైపు వస్తే ఇక ఆ జిల్లాలో తమకు ఎదురే ఉండదు అన్నది జగన్ వ్యూహం. రెండు సార్లు గెలిచి రేపల్లె లో మంచి పట్టు సంపాదించుకున్న అనగాని సత్యప్రసాద్ తో వారి ఓటు బలాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది....
న్యూస్

ప్రభుత్వ భూముల వేలంపై హైకోర్టు కీలక ఆదేశాలు:వేలం వాయిదా

sharma somaraju
అమరావతి : ఏపిలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ...
న్యూస్

వైసీపీ రంగుల వివాదం కేసులో హైకోర్టుకు హాజరైన ఏపి సీఎస్:విచారణ రేపటికి వాయిదా

sharma somaraju
అమరావతి : ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వివాదంపై గురువారం హైకోర్టులో జరిగిన విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ హాజరయ్యారు. అనంతరం న్యాయస్థానం శుక్రవారం...
న్యూస్

పుల్వామా తరహా పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర:భగ్నం చేసిన భద్రతా బలగాలు

sharma somaraju
శ్రీనగర్ : పుల్వామాలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు బుధవారం రాత్రి భగ్నం చేశాయి. 2019 లో 40 మంది సీ ఆర్ పి ఎఫ్ జవాన్ లను...
న్యూస్

నేడు టీటీడీ బోర్డు సమావేశం: 93 అంశాల భారీ ఎజండాపై చర్చ

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు పాలకవర్గ సమావేశం జరుగనున్నది. టీటీడీ ఆస్తుల వేలానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని...
న్యూస్

భారత్ లో లక్షా 58 వేలకు పైగా చేరిన కరోనా కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ : నాల్గొవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్నా దేశంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో నిత్యం...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

టీడీపీ “నాడు – నేడు”

Srinivas Manem
ప్రతి పుట్టుకకు కారణం ఉంటుంది. ప్రతి ఎదుగుదలకు కారణం ఉంటుంది. ప్రతి తిరోగమనానికి ఒక కారణం ఉంటుంది. తిరోగమన దశ తర్వాత ప్రతి పునః పెరుగుదలకు ఒక కారణం ఉంటుంది. అది అన్వేషించడమే కష్టం....
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ముహూర్తం మారింది… సీఎం దగ్గర ఆగింది…!

Srinivas Manem
టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్ (రేపల్లె), ఏలూరి సాంబశివరావు (పర్చూరు) వైసిపిలో చేరిక వ్యవహారం మొన్న ఉదయం నుండి మీడియాలో బాగా నలిగింది. అన్ని చానెళ్లు, సోషల్ మీడియా.., మా “న్యూస్ ఆర్బిట్” సహా...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

sharma somaraju
అమరావతి : ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏపి హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది లక్ష్మీ నారాయణ పిల్...
న్యూస్

ఏపిలో వస్త్ర దుకాణాలకూ అనుమతి

sharma somaraju
అమరావతి : లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వస్త్ర, నగలు, చెప్పుల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుపై హైకోర్టులో పిల్

sharma somaraju
అమరావతి :టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి,...
న్యూస్

ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీంలో చుక్కెదురు

sharma somaraju
అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్‌ను సీజ్‌ చేయాలని...
న్యూస్

‘కరోనా సంక్షోభం నుండి బయటపడాలంటే ప్రజల చేతికి డబ్భులు చేరాలి’

sharma somaraju
న్యూఢిల్లీ : కరోనా లాక్ డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి కేంద్రం డబ్బు చేర్చాలని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో పేదల జీవితాలు మరింత...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఇద్దరు ఈరోజు… మరో ఇద్దరు త్వరలో…!

Srinivas Manem
బాబుని ఒంటరి చేయాలి. ప్రతిపక్ష హోదా లాగేయ్యాలి. టీడీపీ కి భవిష్యత్తు లేకుండా చేయాలి. ఆ కులంలో మనకు అనుకూలంగా ఉన్నవారిని లాగేసి, మిగిలిన వారిని ఒంటరిగా మార్చేయాలి. ఇవే… అచ్చంగా ఇవే జగన్...
న్యూస్

దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం:1500 గుడిసెలు దగ్ధం

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి తుగ్లకాబాద్ మురికి వాడలో ఈ ప్రమాదం జరగగా సుమారు రెండు ఎకరాల మేర విస్తీర్ణంలో మంటలు ఎగిసాయి. ఈ ప్రమాదం కారణంగా...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

వెంకన్న భూములపై కప్పదాట్లు…!

Srinivas Manem
తిరుమల వెంకన్న ఆస్తులకు రక్షణ దొరికింది. ఆయన భూములను ఆయనే రక్షించుకున్నట్టే…! నాడు 2016 లో టిడిపి ప్రభుత్వంలోనే టిటిడి బోర్డు అమ్మకానికి పెట్టింది అంటూ… నేడు వైసిపి ప్రభుత్వంలో టిటిడి బోర్డు అదే...
న్యూస్

భారత్ లో లక్షా 45 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కేసుల ఉదృతి కొనసాగుతున్నది. అయిదు రోజులుగా దేశంలో నిత్యం ఆరు వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్కరోజే కొత్తగా 6,535 కేసులు...
న్యూస్

శ్రీకాకుళం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం-వలస కూలీలు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా

sharma somaraju
అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వలస కూలీలతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో 33 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో మందస మండలం...