బాలీవుడ్ వెళ్లిన కార్తీ ఖైదీ

28 Feb, 2020 - 06:37 PM

తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ మూవీ ఖైదీ. కార్తీ హీరోగా 2019 దీపావళికి రిలీజ్ అయిన ఈ మూవీ పాత్ బ్రేకర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం ఆరు గంటల్లో జరిగే కథతో, నెవర్ బిఫోర్ కథనంతో వచ్చిన ఖైదీ, వంద కోట్ల వసూళ్లు రాబట్టి కార్తీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లోకేష్ కనగరాజ్ టేకింగ్ ఖైదీని మాస్టర్ పీస్ గా, ఈ జనరేషన్ చూసిన ఫైనెస్ట్ క్లాసికల్ గా మార్చింది.

న్యూ ఏజ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఖైదీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కమర్షియల్ అండ్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని బాలన్స్ చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్న అజయ్ దేవగన్, ఈ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. డైరెక్టర్ ఎవరు అనే విషయంలో ఇంకా కంప్లీట్ క్లారిటీ రాలేదు కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. కథ, కథనంలో కొత్తదనం ఉంది కాబట్టి ఖైదీ సత్తా బాలీవుడ్ వర్గాలకి కూడా తెలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.