10th Inter Exams: ఏపి సీఎం వైఎస్ జగన్‌కు మరో సారి లేఖ రాసిన నారా లోకేష్..!  స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. !!

Share

10th Inter Exams: రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పరీక్షలు రద్దు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో సారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. దేశంలోని 15 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని లోకేష్ గుర్తు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నందున టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మరో సారి సీఎం జగన్ ను లేఖలో కోరారు.

10th Inter Exams; nara lokesh wrote letter to ap cm ys jagan
10th Inter Exams; nara lokesh wrote letter to ap cm ys jagan

 

అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. పరీక్షలు జరగనప్పటికీ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఒక్క ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దీనిపై టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు.

Read More: Crime News: పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి కటకటాలపాలైన భర్త..! ఊరంతా షాక్..!!

ప్రస్తుతం రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు ఆల్ ఇండియా పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా విద్యార్థులకు సమయం ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఇబ్బంది లేదని భావించినప్పుడే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఒక తండ్రిగా తాను పరీక్షల నిర్వహణకే మద్దతు ఇస్తానని తెలిపారు. పరీక్షలు రద్దు చేయడానికి పెద్దగా సమయం అక్కర్లేదు కానీ విద్యార్థుల భవిష్యత్ ను తాము పరిగణలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పనిలో పనిగా నారా లోకేష్ పైనా సెటైర్ లు వేశారు. లోకేష్ మాదిరిగా అందరూ దొడ్డిదారిలో మంత్రి పదవి పొందలేరని సెటైర్ వేశారు. లోకేష్ లాగా అందరికీ హెరిటేజ్ తరహా ఆస్తులు లేవని పేర్కొన్నారు.

 


Share

Related posts

Saudhi arabia :దేశంలో పెళ్లి కానీ కుర్రాళ్ళ విషయంలో సౌదీ ప్రభుత్వం కొత్త రూల్..!!

sekhar

అయిదేళ్లకోసారి ధనిక దేశం మనదే..!

Muraliak

జబర్దస్త్ :  స్టేజీ మీద పెద్ద నిజాన్ని లీక్ చేసి దొరబాబు ని హార్ట్ చేసిన హైపర్ ఆది ?

sekhar