Road Accident: ఏపిలో జరిగిన వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం పాలైయ్యారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కు చెందిన 8 మంది హైదరాబాద్ లో వివాహ వేడుకకు హజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అనంతపల్లి శివారులో హైవేపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన సత్తిబాబు, రవితేజ, శ్రావణి కుమారి. అరుణ, 8 నెలల బాలుడితో పాటు మరొకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ప్రమాదం తిరుపతి జిల్లాలో జరిగింది. తిరుపతి జిల్లా ఎస్వీపురం టోల్ ప్లాజా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న టెంపో ట్రావలర్స్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పుత్తూరు – తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. తిరుపతిలోని ఎస్ఆర్ ఇండియా ప్రైమ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నిర్వహకులు సుబ్రహ్మణ్యం, రాజశేఖరరెడ్డి లు వారి కార్యాలయంలో పని చేసే 12 మంది సిబ్బందితో వడమాలపేట మండలం ఎస్వీ పురంలోని అంజేరమ్మకు మొక్కు చెల్లించేందుకు టెంపో ట్రావెలర్స్ లో వెళుతూ ఎదురుగా వస్తున్న హెరిటేజ్ పాల ట్యాంకర్ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో టెంపోలో ఉన్న 12 మందితో పాటు మిల్క్ ట్యాంకర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను టోల్ ప్లాజా అంబులెన్స్ లో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తొంది. క్షతగాత్రులు నెల్లూరుకు చెందిన రాజశేఖర్, తిరుపతి కొత్తపల్లికి చెందిన లతారెడ్డి, సత్యనారాయణపురానికి చెందిన కాంతిరేఖ, నారాయణరెడ్డి, రెడ్డిగుంటకు చెందిన కుమారస్వామి రెడ్డి, అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన నరసింహులు, రాజంపేట కు చెందిన సుజాత, సత్యసాయి జిల్లాకు చెందిన ఆంజనేయులు ఉన్నారు.
ఆశ ఉండవచ్చు .. కల కనవచ్చు .. కానీ ..ఇంతనా..?