ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP RRR Case: ఎంపి రఘురామకు 14 రోజులు రిమాండ్..! కానీ..?

MP RaghuramakrishnamRaju What Happens if Police beats him
Share

MP RRR Case: ఎంపి రఘురామ కృష్ణంరాజుకు గుంటూరులోని ఆరవ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ (సీఐడి కేసుల ప్రత్యేక న్యాయస్థానం) కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 28 వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో ఎంపిని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. ముందుగా జీజీహెచ్, ఆ తరువాత రమేష్ ఆసుపత్రికి తరలించాలనీ సూచిస్తూ  ఆయన కోలుకునే వరకూ ఆసుపత్రిలో ఉండవచ్చని తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకూ ఆయనకు వై కేటగిరి భద్రత కొనసాగుతుందని తెలిపింది. ఆయన శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది.

14days remand for MP Raghurama krishnam raju
14days remand for MP Raghurama krishnam raju

కాగా ఎంపి రఘురామ కృష్ణంరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసిందనీ, మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో భోజనం కూడా తెచ్చారని వివరించారు. అప్పటి వరకూ సాధారణంగా ఉన్న ఆయన హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ కాగానే కొత్త నాటకానికి తెరతీశారని, పోలీసులు తనను కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కథ అల్లారని అన్నారు.


Share

Related posts

Smart Watch : కొంపముంచిన స్మార్ట్ వాచ్.. అసలేం జరిగిందంటే..

bharani jella

మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

Siva Prasad

‘రాష్ట్రానికి కాయకల్ప చికిత్స’

somaraju sharma