Fishing boats: ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖ మత్స్యకార బోట్లు..! అప్రమత్తమైన అధికారులు..!!

Share

Fishing boats: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిశా తీరంలో చిక్కుకున్నాయి. దీంతో ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారం తెలుసుకున్న ఏపి ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యశాఖ జేడి లక్ష్మణరావు గంజాం పోర్టు అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయి. గంజాం పోర్టులోకి 17 బోట్లను అనుమతించారు. మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

30 fishing boats from visakhapatnam stranded off the coast of Odisha
30 fishing boats from visakhapatnam stranded off the coast of Odisha

కాగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాకి పశ్చిమ వాయువ్యదిశగా 80 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించి బలహీన పడి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురస్తాయని తెలిపింది.


Share

Related posts

ఈ కోర్స్ నేర్చుకుంటే ఇక తిరుగుండదు..

bharani jella

Betel Leaf: పెళ్లిళ్లలో ప్రతి ఫంక్షన్లో వాడే తమలపాకులో ఇంత పెద్ద సీక్రెట్ ఉందా.. ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!

bharani jella

పాత సామాన్లు కొంటాం @ వైసీపీ అండ్ జగన్ ?

arun kanna