Madanapalli (Annamayya): అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం చిక్కుబుల్లాపూర్ నుండి తిరుపతికి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బెంగళూరు రోడ్డు బార్లపల్లి సమీపంలో బొల్తా పడింది. బార్లపల్లి వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కారు యూటర్న్ తీసుకుంటుండగా అటు వైపు నుండి వస్తున్న ప్రైవేటు బస్సు ఆ వాహనాన్ని వెనుక భాగం నుండి ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న పెద్ద లోయలో పడింది.

ఈ ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న పిల్లలు, మహిళలు, పెద్దలు ఒకరిపై ఒకరు పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక్క సారిగా హాహాకారాలు చేశారు. ప్రయాణీకుల్లో చాలా మంది కాళ్లు, చేతులు విరిగిపోగా, మరి కొంత మంది తలకు గాయాలు అయ్యాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్, జనసేన పార్టీ నేత గంగారపు రాందాస్ సోదరులు బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
YS Viveka Case: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా