Dhone (kurnool): జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా పరిపాలన అందిస్తున్నదనీ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన 60 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాల వారు మంత్రి బుగ్గన సమక్షంలో బుధవారం టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారుతుంది – సీఎం జగన్