ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సభలో అపశృతి .. సొమ్మసిల్లి మహిళ మృతి .. సీఎం జగన్ ఏమి చేశారంటే..?

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం కృష్ణాజిల్లా పెడనలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హజరైయ్యారు. అయితే ఈ సభలో అపశృతి చోటుచేసుకుంది. సభకు హజరైన ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది. మృతురాలిని మాణిక్యమ్మ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేష్ వెంటనే ఈ విషయాన్ని నేరుగా సీఎం జగన్ కు తెలియజేశారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్ .. బాధిత మహిళ కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

 

బాధిత మహిళ కుటుంబానికి తక్షణం పరిహారం అందజేయాలని మంత్రి రమేష్ కు సీఎం జగన్ ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో మంత్రి జోగి రమేష్ .. బాదిత మహిళ కుటుంబానికి రూ.10లక్షల చెక్కును ఈ రోజే అందజేశారు.బాధిత కుటుంబాలకు ఇంత వేగంగా పరిహారం అందించడం ఇదే ప్రధమం కావచ్చు. ప్రభుత్వం ద్వారా పరిహారం అందాలంటే రోజులు, నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుంటుంది. కానీ మృతి చెందిన బాధిత కుటుంబానికి ఇంత వేగంగా ఆర్దిక సాయం అందించడం పట్ల పలువురు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

బందరు ప్రాంత ప్రజలకు శుభ వార్త చెప్పిన సీఎం వైఎస్ జగన్


Share

Related posts

KCR: నేడే సంచ‌ల‌న నిర్ణ‌యం… లాక్ డౌన్ పై తేల్చేయ‌నున్న కేసీఆర్‌?!

sridhar

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కి వచ్చిన 6% ఓట్లు ఇతర పార్టీలకి రావాలి అంటే 300 కోట్లు ఖర్చు పెట్టాలి – కృష్ణం రాజు

sekhar

జగన్ చుట్టుపక్కల పెద్దలు ఇచ్చిన సలహానే రఘురామరాజు కూడా ఇచ్చారు ! 

sekhar