Chandrababu Advocate Sidharth Luthra Tweets: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఐడీ అధికారులు ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే .. చంద్రబాబును ఈ కేసు నుండి విముక్తి కల్గించేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేకంగా సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా ను ప్రత్యేక విమానంలో టీడీపీ రప్పించింది. సిద్ధార్ధ లూథ్రాకి దేశంలోనే ముఖ్యమైన న్యాయవాదుల్లో ఒకరుగా పేరు ఉంది.
చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయాలంటూ లూథ్రా బలమైన వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టు అంతా డొల్లేనని, ప్రాధమిక ఆధారాలు కూడా లేవనీ, చంద్రబాబు అరెస్టు చేయడం చట్ట సమ్మతం కాదనీ, గవర్నర్ అనుమతి లేదని కూడా వాదించారు. అన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని అనుకున్నారు లూథ్రా. అయితే సీఐడీ తరుపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలకే ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చింది. అంతే కాకుండా ఎన్ఎస్జీ భద్రత కల్గి ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రత, రక్షణ కష్టమని, కావున హౌస్ రిమాండ్ (గృహ నిర్బంధం) ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. అందుకూ బలమైన వాదనలు సుదీర్ఘంగా వినిపించారు లూథ్రా, అయినా ఈ అంశంలోనూ సీఐడీ వాదనలకే కోర్టు ఏకీభవించింది. గృహ నిర్బంధం పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దాంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో సీఐడీ తరపున ప్రభుత్వం తరపు న్యాయవాది కౌంటర్ దాఖలునకు సమయం కావాలని కోరడంతో కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది. దీంతో వారం రోజుల పాటు చంద్రబాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా చేస్తున్న ఆసక్తికరమైన ట్వీట్ లు చేస్తున్నారు. ఈ ట్వీట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆయన ఏమని రాసుకొచ్చారు అంటే..అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు ని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేశారు. ఈ రోజు ఇదే మా నినాదం అని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. రెచ్చగొట్టేలా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలని స్వామి వివేకానంద కర్మోయగంలో రాసుకొచ్చారని పేర్కొన్నారు. అలానే న్యాయం, ధర్మం కోసం నిలబడిన సిక్కు గురు చెప్పిన సూక్తులను అర్ధం చేసుకోని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాసుకొచ్చారు. తొలి ట్వీట్ లపై టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారంటూ నెటిజన్ ల నుండి విమర్శలు పెరగడంతో రెండో ట్వీట్ చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే సిద్ధార్ధ లూథ్రా చేస్తున్న ట్వీట్ల వెనక అర్ధం ఏమిటి.. ఎందుకు అలాంటి సూక్తులు పోస్టు చేస్తున్నారంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023
Swami Vivekananda says in Karma Yoga – "A man must go about his duties without taking notice of the sneers and the ridicule of the world." And definitely not by those who have neither read nor understood the words of the venerable 1Oth guru who stood for justice and piety!!
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 14, 2023