YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన పంచాయతీ ఉప ఎన్నికలలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలవడం జరిగింది. దీంతో మరోసారి గ్రామస్థాయిలో వైసీపీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో నిరూపితం అయింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో.. పంచాయతీ ఉప ఎన్నికలలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక ఇదే సమయంలో ఈ ఉప ఎన్నికలలో సైతం టీడీపీ చతికల పడింది. ఆశించిన స్థాయిలో టీడీపీ పుంజుకోలేకపోయింది. జనసేన పార్టీ విషయానికి వస్తే ఆటలో అరటిపండు అన్నట్టు పరిస్థితి నెలకొంది.
దీంతో పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ, జనసేన శ్రేణులకు నిరుత్సాహాన్ని మిగిల్చాయి. 66 సర్పంచ్ పదవులలో ఏకగ్రీవాలతో కలిపి 53 చోట్ల YSRCP గెలుపు అందుకోగా 10చోట్ల టీడీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించటం జరిగింది. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆరింటికి ఐదు వార్డుల్లో వైసీపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నెలకొంది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలైనా ఎప్పుడు వచ్చినా వైసీపీ విజయ పరంపర కొనసాగుతూనే ఉందని మరోసారి రుజువయింది. రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్ కు ప్రత్యర్థి పార్టీలు తునాతనకలైపోతున్నాయి.
గ్రామస్థాయిలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉందని ఈ పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మరోసారి రుజువయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పార్టీ శ్రేణులు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి 12 గంటలు అవ్వకముందే.. మరో జాతీయ సర్వేలో వైసీపీ అత్యధిక స్థానాలతో అధికారంలోకి వస్తుందని ఫలితాలు రావడం విశేషం. ఇదే సమయంలో జనసేన, టిడిపి, బిజెపి కలిసి వస్తే.. కూడా జగన్ పార్టీని కదిలించే ప్రసక్తి ఆంధ్రాలో కనిపించడం లేదని సదరు జాతీయ సర్వేలో ఫలితాలు వచ్చాయి అంట. 25 ఎంపీ స్థానాలకు 24 వైసీపీ గెలుచుకోవటం గ్యారెంటీ అని సర్వేలో తేలింది అంట. సరిగ్గా ఇదే మాదిరిగా టైమ్స్ నౌ సర్వే ఫలితాలు కూడా రావడంతో.. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.