NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ సీఎంగా జ‌గ‌న్ సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఇది కాద‌నలేని స‌త్యం. ఆయ‌న బాట‌లో న‌డిచిన చంద్ర‌బాబును చూస్తే.. ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఇక‌, అభివృద్ధి ప‌రంగా ఆయ‌న వెనుక‌బ‌డి ఉన్నార‌ని ప్ర‌తిప‌క్షాలు చేసిన ప్ర‌చారాన్ని జ‌గ‌న్ కూట‌మి బ‌లంగా తిప్పికొట్ట‌లేక పోయింది. దీనికి కార‌ణం ముందు నుంచి కూడా స‌రైన ప్లాన్ లేక పోవ‌డం. నిజానికి అభివృద్ధి లేదా? అంటే.. ఉంది. ఇది టీడీపీ నాయ‌కులు కూడా చెబుతున్న‌మాట‌. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోనే నిర్మాణం అవుతున్న ఓడ‌రేవులు.. నాడు నేడు ద్వారా అమ‌ల‌వుతున్న స్కూళ్ల పురోగ‌తి వంటివి దీనికి ఉదాహ‌ర‌ణ‌.

అంతేకాదు.. రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా యూనివ‌ర్సిటీలు వ‌చ్చాయి. విద్యాల‌యాలు వ‌చ్చాయి. వైద్య విద్యాల యాలు కూడా.. 17 వ‌చ్చాయి. ఇలాంటి వి అభివృద్ధే. అయితే.. వీటిని చెప్పుకోవ‌డంలోనూ.. ప్రచారం చేసుకోవ‌డంలోనూ జ‌గ‌న్ చాలా వ‌ర‌కు వెనుక‌బ‌డి పోయారు. ఏనాడూ.. ప్రెస్ ముందుకు రాక‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుసుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డం వంటివి ఆయ‌న‌కు భారీ మైన‌స్ అయిపోయాయి. అంతేకాదు.. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు ఊరూవాడా ప్ర‌చారం చేసిన‌ప్పుడు కూడా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని అనుకున్నారో..లేక‌.. తాను చేసేది క‌రెక్టే అనుకున్నారో.. తెలియ‌దు కానీ.. జ‌గ‌న్ మౌనం వ‌హించారు. ఇక‌, రాష్ట్రంలో ఎన్న‌డూ లేని విధంగా మ‌హిళ‌లు అదృశ్యం అవుతున్నార‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు కూడా జ‌గ‌న్ ఏనాడూ ఖండిం చ‌లేక పోయారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ దీనికి కౌంట‌ర్ ఇవ్వ‌లేక పోయారు. కేవ‌లం వ‌లంటీర్లే అన్నీ చూసుకుంటార‌ని భావించారు. వలంటీర్లే సర్వ‌స్వం అనుకున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో నిజం ఏంటో తెలియ‌లేదు. కానీ, ప్ర‌చారం మాత్రం జ‌రిగిపోయింది. చివ‌ర‌కు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తీవ్ర దుమారం రేగిన‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షాలు రేపిన‌ప్పుడు కూడా.. తెలివిగా ఈ విష‌యంలో వ్య‌వ‌హ‌రించ‌లేక పోయారు.

వెర‌సి మొత్తంగా జ‌గ‌న్ చేయాల్సిన ప్ర‌చారంలో కేవ‌లం తాను సంక్షేమం ఇస్తున్నాన‌ను.. ఇది తాను మాత్ర‌మే చేయ‌గ‌ల‌న‌న్న వాద‌న ఒక్క‌టే త‌ప్ప‌.. మ‌రేమీ క‌నిపించ‌లేద‌న్న‌ది వాస్త‌వం. అయితే.. ఈ ఒక్క‌టే ఓట్లు రాల్చిందా? అంటే.. ప్ర‌స్తుతం పోలైన ఓట్ల‌ను బ‌ట్టి చూస్తే.. కాద‌నే విష‌య‌మే.. బ‌య‌ట‌కు వ‌స్తోంది.పైగా మూడు రాజ‌ధానుల అంశాన్ని కూడా.. ప్ర‌జ‌ల్లో పాజిటివిటీ వైపుగా జ‌గ‌న్ బ‌లంగా తీసుకువెళ్ల‌లేక‌పోయారు. దీనికి తోడు.. అమ‌రావ‌తి రైతుల అంత‌ర్గ‌త ప్ర‌చారాన్ని ఆయ‌న ప‌సిగ‌ట్ట‌లేక పోయారు. సో.. ఇవ‌న్నీ కూడా.. జ‌గ‌న్‌కు ఇప్పుడు తెలిసి వ‌స్తున్నాయి. కానీ, చేతులు కాలిపోతున్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్న నేపథ్యంలో ఇప్పుడు త‌ల‌ ప‌ట్టుకున్నాప్ర‌యోజ‌నం ఉంటుందా? అనేది ప్ర‌శ్న‌. చూడాలి ఏంజ‌రుగుతుందో..!

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?