24.2 C
Hyderabad
December 9, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Allagadda Bhuma Family: భూమా ఫ్యామిలీ గొడవ..! ఇరుక్కున్న అఖిలప్రియ, సీటు కోసం టీడీపీ ..

Share

Allagadda Bhuma Family: వారసత్వం అనేది సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ వస్తుంది. అయితే ఆ వరసత్వాన్ని కరెక్టుగా నిలబెట్టుకుంటే ఆ బ్రాండ్ ముందు తరాలకు వెళుతుంది. అది నెలబెట్టుకోలేకపోయినా, ఫెయిల్ అయినా తప్పులేదు కానీ.. తనకు ఆ బ్రాండ్ ద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ముందు తరాల వారిని అభాసుపాలు చేయకూడదు. సమాజంలో వారిని చెడుగా ప్రొజెక్టు చేయకూడదు. అయితే అటువంటి చర్యలను కొన్ని ఫ్యామిలీల్లో కొంత మంది వారసులు చేస్తున్నారు. ఉదాహారణకు రాజకీయ రంగంలో చూసుకుంటే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా భూమా బ్రాండ్ కు ఉన్న ప్రత్యేకత అది. దివంగత భూమా నాగిరెడ్డి ఎంపీగా పని చేశారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భార్య సోభా నాగిరెడ్డి మంచి మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు దంపతులు ప్రజా ప్రతినిధులుగా బాధ్యతలు నిర్వహించి ఆ ప్రాంతంలో చెరిగిపోని ముద్రసంపాదించుకున్నారు. వీళ్ల రాజకీయ వారసులుగా భూమా అఖిలప్రియ ఉన్నారు. 2014 లో ఎన్నికల్లో భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిలు గెలిచినా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. అయితే ఇప్పుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నమోదునకు ఎవరు కేసు పెట్టారు..? కేసు పెట్టిన వాళ్లు ఎవరికి సన్నిహితులు..? అనే విషయాలను పరిశీలించిన వారికి దీనికి కారణం భూమా అఖిలప్రియ, ఆయన భర్త భార్గవ్ లు కారణమనే అనుమానాలు వినబడుతున్నాయి. ఈ అనుమానాలు నిజమో? అబద్దమా? అనేది ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు.

allagadda Politics

 

భూమా నాగిరెడ్డి దంపతులు గతంలో వారికి ఉన్న ఒక భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, కిషోర్ రెడ్డి తల్లి భూమా శివలక్ష్మమ్మల పేరు మీద బ్యాంకులో రుణం ఉంది. భూమా నాగిరెడ్డి దంపతులు బతికి ఉన్నంత కాలం బ్యాంకు వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు. వారి మరణానంతరం ఆ రుణానికి సంబంధించి వారి వరసులు వడ్డీ, అసలు కూడా చెల్లించలేదు. దీంతో బ్యాంకు వారి వారసులైన భూమా అఖిలప్రియకు నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ ఆస్తిని కాపాడుకునేందుకు కొన్ని అంతర్గత లావాదేవీలు జరిపి చీటింగ్ కేసు పెట్టారు. ఆ డాక్యుమెంట్ లు అసలువి కాదు, బ్యాంకును మోసం చేసి రుణం తీసుకున్నారు అన్నట్లుగా కేసు పెట్టారు. ఆ కేసు ఎవరు పెట్టించారు అనే విషయాలను ఆళ్లగడ్డ నియోజకవర్గ బీజేపీ నేతగా ఉన్న భూమా కిషోర్ మీడియా సమావేశాన్ని నిర్వహించి స్పష్టం గా వెల్లడించారు. భూమా నాగిరెడ్డి రాజకీయ వారసులుగా ఉన్న అఖిలప్రియ ఇప్పటికే ఒ కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నారు. భార్గవ్ జైలుకు కూడా వెళ్లారు. ఇది టీడీపీకి ఒక ఇబ్బందికర అంశం. ఇది కాకుండా ఈ రెండు మూడు నెలల వ్యవధిలో ఓ సెటిల్ మెంట్ వ్యవహారంలో ఒకరి వద్ద డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు అయ్యింది. తాజాగా ఈ వివాదం వారికి తోడైంది. అలాగే ఆ కుటుంబంలో ఆస్తుల వివాదాలు ఉన్నాయి.

Bhuma Family

 

నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఆళ్లగడ్డ తదితర నియోజకవర్గాల్లో ఇప్పుడు అసలు పార్టీ (టీడీపీ) పరిస్థితే బాగోలేదు. ఈ సమయంలో నియోజకవర్గాల్లో ఇంటింటికి తెరిగి పార్టీని చక్కదిద్ది భూమా నాగిరెడ్డి వేసిన పునాదులను స్ట్రాంగ్ చేసి ఆ పేరు ప్రఖ్యాతులను పెంచకుండా ఇటువంటి వివాదాలు, ఆరోపణలు కారణంగా అఖిలప్రియ కొంత మేర ఇబ్బందులు పడుతున్నారు. ఆమెకు తెలిసి జరుగుతున్నా, తెలియక జరుగుతున్నా ఆమె మాత్రం రాజకీయంగా ఇబ్బందుల్లోకి వెళుతున్నారు. పార్టీ కూడా ఆమె పట్ల సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇన్ని వివాదాలు, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్లకు సీటు ఇస్తే ఏమవుతుందో అన్న భయం పార్టీకి పట్టుకుంది. అందుకే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ప్రజల్లో తిరుగుతూ మంచి పేరు తెచ్చుకుని వివాద రహితుడుగా ఉన్న భూమా కిషోర్ రెడ్డి వైపు టీడీపీ చూస్తొంది అని అంటున్నారు. ఆయన కూడా భూమా ఫ్యామిలీ వారసుడిగానూ భావిస్తున్నారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో భూమా వర్గంలో సగం మంది కిషోర్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు.

Bhuma Akhila Priya

 

భూమా నాగిరెడ్డి దంపతులపై కేసు నమోదు కావడాన్ని భూమా కిషోర్ రెడ్డి ఖండించారు. రీసెంట్ గా మీడియా సమావేశం నిర్వహించి ఆ కేసు పెట్టడానికి కారణం ఎవరు అని స్పష్టంగా తెలియజేస్తూ వాళ్లపై పెట్టిన తప్పుడు కేసును విరమింపజేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలియజేయడం ద్వారా మెజార్టీ భూమా వర్గీయుల అభిమానాన్ని కిషోర్ రెడ్డి తన వైపు తిప్పుకోగలిగారు. ఈ తరుణంలోనే ఆళ్లగడ్డకు అఖిలప్రియ పార్టీ ఇన్ చార్జిగా ఉన్నప్పటికీ టీడీపీ నేతలు కిషోర్ రెడ్డితో సంప్రదింపులు జరిపారని సమాచారం. కిషోర్ రెడ్డిని అమరావతికి పిలిపించి కొందరు టీడీపీ నేతలు మాట్లాడారని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నెల రెండు నెలల వ్యవధిలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో అంతర్గత మార్పులు జరగవచ్చని ఇది అక్కడి రాజకీయ ప్రకంపనలకు దారి తీయవచ్చని సమాాచారం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వివాదాలు, ఆరోపణలు అఖిలప్రియ క్యాడర్ ను డిస్ట్రబ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు.

అంకే 18 యే.. సున్నాలే మారుతున్నాయి ..! మునుగోడు ఉప ఎన్నికల్లో నేతల ఆరోపణలు..!!

 

Bhuma Kishor Reddy

 

https://www.facebook.com/BhumaKishoreReddy.Official/videos/937142397674048/


Share

Related posts

Amalapuram violence: అమలాపురం విధ్వంసకర ఘటనలో మంత్రి విశ్వరూప్ సంచలన కామెంట్స్

somaraju sharma

కొత్త కరోనా వైరస్ పై అంత ఆందోళన వద్దట…! నిమిషాల్లో టీకా రెడీ…

siddhu

పెళ్లి సెట్ చేయడమేంట్రా.. నేనేమన్నా బ్రోకరా? శివశంకర్ మాస్టారు ఫైర్

Varun G