NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు తెలపడంపై… బహిరంగంగానే స్పందించారు బాబు.

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవాలని మెగా హీరోలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. కానీ మెగా అల్లుడు అల్లు అర్జున్ మాత్రం యూ టర్న్ తీసుకొని… వైసిపి పార్టీకి జై కొట్టాడు. నంద్యాల వైసిపి అభ్యర్థి అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా నిలిచాడు అల్లు అర్జున్. అంతే కాదు శనివారం రోజున… వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ నిర్వహించి ప్రచారం కూడా చేశాడు అల్లు అర్జున్.

మెగా హీరోలంతా జనసేనకు ఓటు వేయాలని ప్రచారం చేస్తుంటే… అల్లు అర్జున్ మాత్రం వైసిపి పార్టీకి ఓటు వేయాలని రంగంలోకి దిగాడు. ఇప్పుడు ఇదే అంశం మెగా కుటుంబంలో పెద్ద చీలికను తీసుకువచ్చింది. జనసేన ను కాదని… వైసిపి పార్టీ వైపు అల్లు అర్జున్ వెళ్లడం పై మెగా కుటుంబ సభ్యులు కూడా ఫైర్ అవుతున్నారు. అంత దోస్తానా ఉంటే… సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే సరిపోవు కదా…. ఏపీకి వెళ్లి మరి ప్రచారం చేయాలా? ఇది వెన్నుపోటు రాజకీయం అంటూ అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ తో పాటు… కుటుంబ సభ్యులు కూడా ఫైర్ అవుతున్నారట.

అయితే ఇదే గ్యాప్ లో… చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. తన ఫ్రెండ్ వైసిపి అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం మాత్రమే అల్లు అర్జున్ వెళ్లాడని… అతని కోసం మాత్రమే ప్రచారం చేశాడని చంద్రబాబు తెలిపారు. కానీ వైసీపీ సైకోలు మాత్రం… జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ ర్యాలీలో తిరిగారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. చిల్లర రాజకీయాలు చేస్తూ… అల్లు అర్జున్ సభలో… జనసేన జెండాలు పట్టుకొని… ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని చంద్రబాబు ఆగ్రహించారు.

అదే సమయంలో… అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన వైసీపీ అభ్యర్థి కిషోర్ రెడ్డిని కూడా బండ బూతులు తిట్టారు చంద్రబాబు. నంద్యాల ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి కాదని… ఆయన సండే ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ అభ్యర్థి ఓడిపోతాడని… చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన వైసీపీ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తాడని… తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతాడని చంద్రబాబుకు చాలెంజ్ …విసురుతున్నారు బన్నీ అభిమానులు. మరి నంద్యాలలో ఓటర్లు ఎటువైపు ఉంటారో చూడాలి.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N