Amalapuram Tensions: ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో ఒక్క సారిగా విధ్వంసకర సంఘటనలు జరిగాయి. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రాళ్ల దాడి చేశారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. జిల్లాలో పరిస్థితులను అదుపు చేసేందుకు భారీ గా పోలీసు బలగాలను మోహరించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజు అమలాపురంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను కోనసీమకు తరలించారు.
అయితే ఈ విధ్వంసకర పరిణామాలు రాజకీయ కుట్రే అని అంటున్నారు. అధికార వైసీపీ దీని వెనుక ప్రతిపక్ష టీడీపీ, జనసేన కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వ వైఫల్యాన్ని వైసీపీ ప్రతిపక్షాలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని వీళ్లు విమర్శిస్తున్నారు. ఇలా అధికార పక్షంపై ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలపై అధికార పార్టీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారు అనేది పోలీసు దర్యాప్తులో తేలనుంది.
మరో పక్క అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. సీసీ పుటేజీలు వీడియోల ద్వారా నిన్న విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించే పనిలో పోలీస్ యంత్రాంగం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణకై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాల్ రాజు తెలిపారు. ఈ ఘటన వెనుక ఏయే శక్తులు ఉన్నాయో అందరినీ బయటకు తీస్తామనీ, దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు డీఐజీ పాల్ రాజు. పోలీసుల దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతుందా.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయా.. అదృశ్య శక్తులు ఎవో తేలే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…