NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amalapuram Violence: అమలాపురం విధ్వంస ఘటనల్లో పాల్గొంది వీళ్లే …! పక్కా ఆధారాలతో కుట్రదారులను వెలికితీస్తున్న పోలీసులు

Amalapuram Violence: కోనసీమ జిల్లా సాధన సమితి ముసుగులో అమలావురంలో అల్లర్లు, విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించే పనిలో పోలీస్ యంత్రాంగం సఫలం అవుతోంది. ఇటీవల అమలాపురంలో జరిగిన విధ్వంసకర ఘటనను పురస్కరించుకుని అధికార పక్షంపై ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్షాలపై అధికార పక్షం విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జిల్లా సాధన సమితి ఉద్యమం కంట్రోల్ తప్పి మంత్రి విశ్వరూప్. ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిప్పు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఈ క్రమంలో పోలీస్ యంత్రాంగం ఈ దాడుల్లో పాలుపంచుకున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. సీసీ టీవీ పుటేజీ, వీడియోలు, వాట్సాప్ గ్రూపు ఛాటింగ్, సెల్ ఫోన్ డేటాల ఆధారంగా 80 మందికిపై గా నిందితులను గుర్తించారు. ఇందులో గురువారం 19 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Amalapuram Violence 19 persons arrested
Amalapuram Violence 19 persons arrested

అరెస్టు అయిన 19 మందిలో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన వారే

పోలీసులు అరెస్టు చేసిన 19 మందిలో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీ చెందిన వారు ఉన్నట్లు తెలుస్తొంది. ఒకరు మాత్రం ఏ పార్టీకి చెందని వ్యక్తి ఉన్నారు. అల్లర్లలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రామారావు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తూ వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చిన రాజప్ప అనుచరుడు వడగన నాగరాజు పై కేసు నమోదు చేశారు, ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం దాడులకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు .. నిందితులపై హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, దొమ్మి తదితర సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

 

Amalapuram Violence: నేడు మరి కొందరు అరెస్టు

అమలాపురం విధ్వంసకర ఘటనల్లో నిందితులను గుర్తించేందుకు ఆరు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయి. విధ్వంస ఘటనల్లో పాల్గొన్న వారి పేర్లను గ్రామాల వారీగా సేకరిస్తున్నారు. ఈ రోజు మరి కొంత మందిని అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చే అవకాశం ఉంది. అరెస్టు అయిన నిందితుల వివరాలు వెల్లడి కావడంతో ఇది ప్రతిపక్షాల కుట్రేనని అధికార పక్షం చేస్తున్న వాదనలకు బలం చేకూరుతోంది. నిందితులు గతంలో ఆయా పార్టీ నేతలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేస్తొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N