Amalapuram Violence: కోనసీమ అల్లర్ల నేపథ్యంలో అమలాపురం తదితర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత ఆరు రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఐటీ ఉద్యోగులతో సహా అనేక వర్గాల ప్రజలు, యువకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కోనసీమలో వారం రోజులైనా ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే ఇంటర్నెట్ సేవలు నిలిపివేత అనే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధాకరమని అన్నారు. ఐటీ ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం.. కనీసం వాళ్లు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేయడం దారుణమని దుయ్యబట్టారు.
ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు చంద్రబాబు. చిరువ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ అధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదని అన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత ప్రజలకు ఇబ్బందిగా మారకూడదని పేర్కొన్నారు చంద్రబాబు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని చంద్రబాబు పోస్టు చేస్తూ ఈ విమర్శలు గుప్పించారు.
ఇటీవల కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అమలావురంలో పెద్ద ఎత్తున నిరసనలు జరగడం, ఆ ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అమలాపురం పంపి బందోబస్తు నిర్వహిస్తొంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నారు. అల్లర్లలో పాల్గొన్న 60 మందికిపైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ మెసేజ్ ల ద్వారా ఆందోళనకారులు విధ్వంసానికి రూపకల్పన చేసినట్లు గుర్తించిన పోలీసు అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా కోనసీమలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే ఈ పరిణామం ఐటీ ఉద్యోగులతో పాటు వ్యాపారులు, ఇతర కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…