NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Amaravathi Capital: రాజధాని కేసుల్లో జగన్‌కి పెద్ద షాక్..? సుప్రీంకి వెళ్లినా పరిస్థితి మారుతుందా..?

Amaravathi Capital: రాజధాని అమరావతికి సంబంధించి ఏపి హైకోర్టులో రోజు వారి విచారణ మొదలైన సంగతి తెలిసిందే. ఎప్పుడో 2020 ఆగస్టు నెల నుండి మొదలైన విచారణ కరోనా కారణంగా ఆగిపోయి, దశలవారిగా చీఫ్ జస్టిస్ ల బదిలీ కారణంగా నిలిచిపోయి, మధ్యలో అనేక మలుపులు, ట్విస్ట్ లు, అఫిడవిట్ లు, కౌంటర్ ల దాఖలు అవన్నీ జరిగి చివరకు ఈ నెల నవంబర్ 15 నుండి మళ్లీ రోజు వారి విచారణ ఆరంభం అయ్యింది. వాదనలు మొదలైనది మొదలు ప్రభుత్వ తరపు వాదనలకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ నుండి కీలక వ్యాఖ్యలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ వాదనలు తేలిపోతున్నట్లు కనబడుతోంది. ఈ రోజు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని అనేది కేవలం రైతుల రాజధానే కాదు. రాష్ట్రం మొత్తానిది అని కామెంట్స్ చేస్తూ స్వాతంత్ర్య పోరాటం చేసిన వాళ్లదే స్వాతంత్ర్యం  కాదు భారతదేశ ప్రజలందరిదీ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు అమరావతి సెంటిమెంట్ ఎంతగా ముడిపడి ఉంది అనేది హైకోర్టు సీజే వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. రాజధాని సెంటిమెంట్ ను ఆయన ఎంతగా గౌరవిస్తున్నారు.

Amaravathi Capital issue im ap high court
Amaravathi Capital issue im ap high court

Read More: YSRCP: వైసీపీ ఎవరి చెవిలో “కమ్మ”ని పూలు పెడుతున్నట్టు..!?

Amaravathi Capital: సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు

అమరావతి రైతుల పోరాటం రాష్ట్రం కోసమేనని ఆయన ఎంతగా ఆలోచిస్తున్నారనేది స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. నిన్న వాదనలు మొదలైన వెంటనే ప్రభుత్వ న్యాయవాది త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు సోమయాజులు, సత్యనారాయణ మూర్తిలను తప్పించి వేరే న్యాయమూర్తులను వేయాలని కోరారు. అయితే దీనికి సీజే అంగీకరించలేదు. న్యాయమూర్తులకు రాష్ట్రంలో ఎక్కడైనా భూములు ఉండవచ్చు, అమరావతిలో వాళ్లకు భూములు ఉన్నాయి కాబట్టి ఈ కేసును ప్రభావితం చేస్తారని అనుకోకూడదు అని ప్రభుత్వ వాదనలను తోసి పుచ్చారు. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడానికి సిద్ధం అవుతూనే సుప్రీం కోర్టుకు వెళ్లినా అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం లేదన్న భావనతో వెనుకడుగు వేస్తోంది. నిన్న కూడా సీజే తన వ్యాఖ్యలో రాజధాని కేసు కోర్టులో పెండింగ్ లో ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ది మందగించినట్లు అనిపిస్తోందని, కక్షిదారులు (వాదులు, ప్రతివాదులు) కూడా ఇబ్బందులు పడుతున్నట్లు అనిపిస్తోందని దీని వల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు అమరావతి అంటే రైతుల రాజధానే కాదు రాష్ట్ర ప్రజలందరిదీ అని వ్యాఖ్యానించారు. అన్నింటికీ మించి దీన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు.

AP Cabinet Meeting: Key Decisions by CM Jagan

సుప్రీంకు వెళ్లక తప్పదా..?

నిన్న, ఈ రోజు వాదనలు, ధర్మాసనం కామెంట్స్ చూస్తే హైకోర్టు కాస్త అమరావతికి అనుకూలంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఒక వేళ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అయితే వెళ్లడం ఖాయం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల వ్యవహారంలో ఇలా అనేక విషయాల్లో హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పులు వస్తే ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయాలు అందరికీ గుర్తే ఉంది. వీటిపై అక్కడ కూడా వ్యతిరేక తీర్పులు వచ్చిన తరువాత కోర్టులను నిందించుకుంటూ సైలెంట్ గా ఉండటం ప్రభుత్వానికి  అలవాటు అయ్యింది. ఇప్పుడు కూడా రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఏ ఇబ్బంది లేదు కానీ వ్యతిరేక తీర్పు వస్తే మాత్రం వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లడం ఖాయమనేది సుస్పష్టం.

author avatar
Srinivas Manem

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N