ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amaravathi : బిగ్ బ్రేకింగ్ : లైవ్ లో బీజెపీ నేత విష్ణువర్థన్ రెడ్డిని చెప్పుతో కొట్టారు

Share

Amaravathi : రాజధాని అమరావతి నిర్మాణాల విషయంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 50 శాతం పైగా నిర్మాణాలు జరిగి ఆగిపోయిన వాటి నిర్మాణాలు కొనసాగించేందుకు అవసరమైన నిధులను వెసులుబాటు కల్పిస్తూ 3వేల కోట్ల రూపాయల మేర బ్యాంకు గ్యారెంటీని ఎంఆర్ఆర్‌డిఏకు ఇస్తూ మంగళవారం కేబినెట్ లో కీలక నిర్ణయాన్ని తీసుకున్నది.

Amaravathi jac leader srinivas vs bjp leader vishnu vardhan reddy
Amaravathi jac leader srinivas vs bjp leader vishnu vardhan reddy

ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన లైవ్ డిబేట్ ఇద్దరు నేతల ఘర్షణతో రసాభాస అయ్యింది. అమరావతి రాజధాని విషయంలో జగన్ విధానం ఏమిటి? అగిపోయిన భవనాలు పూర్తి చేయాలనే నిర్ణయం వ్యూహత్మకమా? రాజధాని తరలింపు విషయంలో జగన్ ఆలోచన మరిందా? అమరావతి – విశాఖ ఉద్యమాలు ప్రభావాన్ని చూపుతున్నాయా? కేబినెట్ నిర్ణయాలన్నీ మున్సిపల్ ఎన్నికల కోసమేనా? అనే అంశంపై  నిర్వహించిన లైవ్ డిబేట్ ఇద్దరు నేతలు వాగ్వివాదానికి, ఘర్షణకు దారి తీయడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది.

ఈ ఘర్షణ చివరకు చెప్పుతో కొట్టే వరకూ వెళ్లడం గమనార్హం. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు ను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంభోధించడంతో వారి వాగ్వివాదం తారా స్థాయికి చేరింది. శ్రీనివాసరావు ఆగ్రహంతో విష్ణువర్థన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అమరావతి ఉద్యమాన్ని కించపరిచినందుకు చెప్పుతో సత్కారం అంటూ సెటైర్ వేస్తున్నారు నెటిజన్ లు. తన ఐఎఎస్ అకాడమి ద్వారా ఎంతో మంది ఐఎఎస్ లను తీర్చిదిద్దిన ఒక దళిత నాయకుడిని పెయిడ్ ఆర్టిస్ట్ అంటే కొట్టరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో శ్రీనివాసరావు డిబేట్ నుండి బయటకు వెళ్లిపోయారు. కాగా లైవ్ డిబేట్ లో విష్ణువర్థన్ రెడ్డిపై అమరావతి జెఏసి నేత శ్రీనివాసరావు దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.

 


Share

Related posts

Bigg Boss Telugu 5: నటి హేమ, కరాటే కళ్యాణి మాదిరిగానే ఈసారి సీజన్ లో ఆమె అంటున్న ఆడియన్స్..!!

sekhar

WHO: కరోనా థర్డ్ వేవ్ పై డబ్ల్యుహెచ్ఒ కీలక వ్యాఖ్యలు

somaraju sharma

Rashmi Gautam At Lenin House First Anniversary

Gallery Desk