NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravathi: రాజధాని కన్ఫ్యూజన్..! ఏపిలో ఆర్బీఐ కార్యాలయం ఎక్కడంటే..?

Amaravathi: దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఓ పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ కు ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు దాటి పోయింది. కానీ ఏపికి రాజధాని లేదు. అమరావతి కేంద్రంగా ప్రస్తుతం రాజధాని కొనసాగుతున్నా అది ఎంత కాలం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఏపికి రాజధాని ఏది అంటే ఠక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిగా కార్యక్రమాలు ప్రారంభించినా ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి సర్కార్ మూడు రాజధానుల కాన్పెప్ట్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని పేర్కొంటూ సీఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయడం, ఆ తరువాత సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. తదుపరి గవర్నర్ ఆమోదంతో చట్టం అయ్యింది.

Amaravathi RBI office in ap
Amaravathi RBI office in ap

 

Amaravathi: త్వరలో నాణ్యమైన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు

అయితే అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, వివిద పార్టీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో రాజధాని తరలింపు ప్రక్రియకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల తాజాగా ప్రభుత్వం రాజధాని బిల్లులను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ సారి ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యమైన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకువస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ బిల్లులను ఉపసంహరించుకున్నప్పటికీ హైకోర్టులో ఈ కేసులను కొనసాగించాలా వద్దా అనే దానిపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఏపి రాజధాని అంశం ఇప్పట్లో తెమిలేలా కనబడటం లేదు. ఇదే కన్ఫూజన్ ఆర్బీఐకి వచ్చింది.

YS Jagan: BJP Two Ways Good News to YSRCP

Amaravathi: రాజధాని ఎక్కడో ప్రభుత్వం తేల్చిన తర్వాతే

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆర్ బీ ఐ డిప్యూటి మేనేజర్ ఎంకే సుభాశ్రీ పేర్కొన్నారు. ఏపిలో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ గత ఏడాది అక్టోబర్ 12న అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు ఆర్బీఐకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఆర్బీఐ పై విధంగా సమాధానం ఇచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju