NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల మహాపాదయాత్ర రెండవ రోజు ఇలా..

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాయాత్ర రెండవ రోజు మంగళగిరి నుండి దుగ్గిరాల వరకూ కొనసాగింది. తొలుత మంగళగిరిలోని లక్ష్మీనర్శింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు.. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం మనసు మారాలని వేడుకున్నారు. అనంతరం మంగళగిరి మెయిన్ రోడ్డు మీదుగా  సాగి ఆత్మకూరు, ఆ తర్వాత పెదవడ్లపూడి వరకూ సాగింది. పెదవడ్లపూడి గ్రామం దాటిన తర్వాత భోజన విరామం తీసుకున్న రైతులు మధ్యాహ్నం అక్కడ నుండి పాదయాత్ర కొనసాగించారు.

Amaravati Farmers Maha Padayatra

 

దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో రైతులకు వినూత్నంగా స్వాగతం పలికారు. కృష్ణాకాలువలో పడవలతో ఆహ్వానం పలికారు. పడవలపై ఫ్లెక్సీలు, బెలూన్లు ప్రదర్శించి స్వాగతం పలికారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు పండ్లు, మజ్జిగ ను గ్రామస్తులు అందజేశారు. ఆట పాటలు, డప్పువాయిద్యాల, నృత్యాల నడుమ పాదయాత్ర రేవేంద్రపాడు తుమ్మలపూడి, చిలువూరు, మంచికలపూడి మీదుగా దుగ్గిరాలకు చేరుకుంది. రెండవ రోజు పాదయాత్ర 18 కిలో మీటర్లు సాగింది. రేపు (బుధవారం) దుగ్గిరాల నుండి పాదయాత్ర చింతలపూడి, ఎరుకలపూడి, తెనాలి మీదుగా పెదరావూరు వరకూ సాగనుంది. పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆయా గ్రామాల్లో రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర అరసవెల్లి వరకూ సాగనుంది. మరో పక్క ఈ పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్రపై దండయాత్రగా అభివర్ణిస్తున్నారు.

రాష్ట్ర విభజన సమస్యలపై 27న కీలక భేటీ .. కేంద్ర హోంశాఖ రూపొందిన అజండా ఇది.. ట్విస్ట్ ఏమిటంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju