NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati JAC: కీలక నిర్ణయం తీసుకున్న అమరావతి జేఏసి..రాష్ట్ర స్థాయి ఉద్యమానికి ప్రణాళిక..!!

Amaravati JAC: అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం రేపటికి 800వ రోజుకు చేరుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మెరుగైన బిల్లు తీసుకువస్తామని చెప్పడం, విశాఖను పరిపాలనా రాజధాని చేయడం ఖాయమని మంత్రులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అమరావతి జేఏసి ఆధ్వర్యంలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.

Amaravati JAC: రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా

అమరావతి ఉద్యమం చేపట్టి 800 రోజులు అవుతున్న నేపథ్యంలో అమరావతి జేఏసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలో అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చే క్రమంలో ముందుకు వెళ్లనున్నామని అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు తెలిపారు. మార్చి నెల నుండి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి జేఏసీల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు చేపడతామని చెప్పారు. శ్రీకాకుళం నుండి ఉత్తరాంధ్ర కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు తమకు మద్దతు తెలుపుతున్నాయన్నారు.

Amaravati JAC: రౌండ్ టేబుల్ సమావేశాలు

ఉభయ గోదావరి పరిధిలోని ఏలూరు, అమలాపురం, రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి చేస్తామన్నారు.  ఈ నెలాఖరుకల్లా ఉభయగోదావరి జిల్లాల్లో అమరావతి జేఏసిల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి చేస్తామని అమరావతి జేఏసి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కేంద్రాల్లో అమరావతి జేఏసిల ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 800 రోజులుగా రోడ్డునపడి పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?