NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉండేది ఒకరు.. పోటీ చేసేది మరొకరు… అదే అక్కడ విచిత్ర రాజకీయం. రాష్ట్రంలోనే అత్యధిక కమ్మ ఓటర్లు ఉండే నియోజకవర్గం జగ్గయ్యపేట. కానీ అక్కడ నుంచి మాజీ మంత్రి నెట్టెం రఘురాం తర్వాత ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలెవరు పోటీ చేయలేదు. 1983లో అక్కినేని లోకేశ్వర్రావు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నెట్టెం రఘురాం వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999, 2004లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి సామినేని ఉదయభాను చేతిలో రఘురాం ఓడారు.

దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారనే చెప్పాలి. అయితే నియోజకవర్గంలో ఇప్పటికీ రఘురాం చక్రం తిప్పుతూనే ఉన్నారు. 2009లో కాంగ్రెస్ మునిసిపల్ ఛైర్మన్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యను టీడీపీలోకి తీసుకువచ్చిన రఘురాం.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేశారు. దీంతో తొలిసారి పోటీ చేసిన శ్రీరామ్ తాతయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో కూడా ఆయనే రెండోసారి గెలిచారు. కానీ 2019లో మాత్రం మరోసారి ఉదయభానుతో తలపడిన శ్రీరామ్ తాతయ్య… ఓడిపోయారు. ఇందుకు ప్రధానంగా సొంత పార్టీ నేతలే కారణమనే మాట బలంగా వినిపిస్తోంది.

ఇక ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరఫున ఉదయభాను, టీడీపీ తరఫున శ్రీరామ్ తాతయ్య పోటీ పడుతున్నారు. వీరిద్దరు ఇలా ముఖాముఖి తలపడటం ఇది వరుసగా నాలుగోసారి. ఇప్పటి వరకు జగ్గయ్యపేట నియోజకవర్గం ఓటరు తీర్పు విలక్షణంగా ఉంది. ఓ పార్టీ నేతకైనా సరే.. వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చారు. రఘురామ్ మూడుసార్లు, ఉదయభాను రెండుసార్లు, శ్రీరామ్ తాతయ్య రెండుసార్లు గెలిచారు. అలాగే జరిగితే మాత్రం మరోసారి ఉదయభాను గెలుస్తారు. కానీ ఈసారి మాత్రం తీర్పు ఆనవాయితీకి విరుద్ధంగా వస్తుందనే మాట వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయభాను తీరు.

ప్రస్తుతం నియోజకవర్గంలో ఉదయభాను కుమారులదే పెత్తనం. ఇటీవల గంజాయి అక్రమ రవాణా కేసులో ఉదయభాను కుమారుడి పేరు కూడా వచ్చింది. అయితే ఆ కేసును మాఫీ చేయించుకున్నారనే మాట బహిరంగ రహస్యం. అలాగే ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో ఉదయభానుకు వాటా వస్తుందనే మాట అందరికీ తెలిసిన విషయమే. ఇక వీటన్నిటికి తోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కూడా. హైవే నుంచి జగ్గయ్యపేట ఊరులోకి వెళ్లే దారి గోతుల మయం. జగ్గయ్యపేట కేంద్రం నుంచి అన్ని గ్రామాల రహదారుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇవన్నీ ఉదయభాను ఓటమికి పరోక్ష కారణాలే.

అదే సమయంలో ఏడాదిన్నరగా నియోజకవర్గంలో శ్రీరామ్ తాతయ్య అన్నా క్యాంటిన్ నిర్వహిస్తున్నారు. ఇది ఆయనకు కొంత కలిసి వచ్చే అంశం. అలాగే సౌమ్యుడనే పేరు కూడా. చంద్రబాబు అండ కూడా ఉన్న నేతగా గుర్తింపు. అయితే నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎంత మేర సహకరిస్తారనేది ప్రశ్నార్థకం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండే నేతల్లో ఒకరైన టీ.డీ.జనార్థన్ ఈ నియోజకవర్గానికి చెందిన నేత. ఆయన గత ఎన్నికల్లో శ్రీరామ్ తాతయ్యకు సహకరించలేదనే మాట వినిపిస్తోంది. అలాగే ప్రస్తుత ఎన్నికల్లో తాతయ్యకు బదులుగా న్యూస్ ఛానల్ అధినేత బీ.రామకృష్ణను దగ్గరుండి మరీ ప్రొత్సహించారనే మాట వినిపిస్తోంది.

అయితే చంద్రబాబు మాత్రం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట పర్యటనకు వచ్చిన సమయంలో తాతయ్య పేరును ముందుగానే ప్రకటించడంతో… అసమ్మతి నేతలంతా సైలెంట్ అయిపోయారు. అయితే పార్టీలో నేతలను తాతయ్య కలుపుకుని పోవటం లేదనే అపవాడు ఉంది. రాష్ట్ర స్థాయి నేతలుగా గుర్తింపున్న ఆచంట సునీత, టీడీ జనార్థన్, నెట్టెం రఘురాంలతో ఇప్పటి వరకు తాతయ్య ప్రత్యేకంగా కలిసింది లేదు. బహిరంగ వేదిక ఏర్పాటు చేసింది కూడా లేదు. అయితే సౌమ్యుడు, చంద్రబాబు అండదండలుండటం తాతయ్యకు కలిసి వచ్చే అంశం. సొంత పార్టీ నేతలపైనే ఉదయభాను బూతు పురాణం ఫోన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగ్గయ్యపేట పట్టణంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానిదే పై చెయ్యి కూడా. ఇవన్నీ తాతయ్యకు కలిసి వచ్చే అంశాలు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?