NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Anandaiah Medicine: ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మందు తయారీ..! నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీకి చర్యలు..!!

Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఇటు ప్రభుత్వం, అటు హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందును తొలుత నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేయాలని నిర్ణయించుకుని ఆ మేరకు మందు తయారు జరుగుతోంది. మరో పక్క చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆనందయ్య మందున నియోజకవర్గంలోని లక్షా 60వేల కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్, ఆయన శిష్యబృందం సహకారంతో పెద్ద ఎత్తున మందు తయారీని ఆదివారం ప్రారంభించారు. ఇప్పటికే ప్రజా భాగస్వామ్యంతో మందు తయారీకి అవసరమైన సహజ సిద్ధ వనమూలికలు, ఇతర వస్తువులను సిద్ధం చేశారు.

Anandaiah Medicine in chandragiri
Anandaiah Medicine in chandragiri

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కరోనా రాకుండా, శరీరంగా రోగ నిరోధక శక్త పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్ (పి) ను మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని లక్షా 60వేల కుటుంబాలలోని 5.20లశ్రల మంది ప్రజలకు ఉచితంగా ఆనందయ్య మందును అందించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో మందు పంపిణీ జరుగుతుందన్నారు. సోమవారం సాయంత్రానికి మందు తయారీ పూర్తి అవుతుందని, మంగళవారం నుండి పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆనందయ్య కుమారుడు శ్రీధర్ ఈ సందర్భంగా కరోనా కట్టడికి ఉపయోగపడే సాంప్రదాయ మందు తయారీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. వనమూలికల సేకరణ యజ్ఞంగా చేపట్టారని అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం చెవిరెడ్డిలా ఆలోచన చేసే నాయకులు లేరని అన్నారు. ఇతర ప్రజా ప్రతినిధులకు చెవిరెడ్డి ఆదర్శనీయంగా నిలుస్తారని పేర్కొన్నారు.

Read More: Dhulipalla Narendra: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళపై మరో కేసు నమోదు..! ఎందుకంటే..!

తొలి నుండి చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా కట్టడి చర్యల్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. దాదాపు రూ.25 లక్షలకుపైగా నిధులు వెచ్చించి ఆక్సిజన్ బెడ్లు సిద్దం చేశారు. భాధితులకు అవసరమైన మందులు అందించేందుకు నియోజకవర్గంలో ఏడు కోవిడ్ మెడికల్ షాపులను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రత్యేకంగా ఏడు అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. కోవిడ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకుంటూ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి పది మాస్కులు చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. ఇప్పుడు తాజాగా ఆనందయ్య మందు పంపిణీకి చెవిరెడ్డి చర్యలు చేపట్టారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N