Subscribe for notification

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతిపై అనంతపురం ఎస్పీ ఇచ్చిన క్లారిటీ ఇది..

Share

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి (49) మరణించిన సంగతి తెలిసిందే. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి చాలా కాలంగా అనంతపురం జిల్లా యాడకిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేశారు. తన భర్త మరణంపై ఎటువంటి అనుమానాలు లేవని అతని భార్య మీడియాకు, పోలీసులకు తెలిపింది. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Anantapur SP Fakeerappa Clarifies On Viveka Murder Case Witness Gangadhar Reddy Death

Viveka Murder Case: గంగాధర్ రెడ్డి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు

అయితే గంగాధర్ రెడ్డి మరణంపై అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. గంగాధర్ రెడ్డి మరణం అనుమానాస్పదమేమీ కాదనీ, అతను అనారోగ్య కారణాలతోనే మరణించాడని వెల్లడించారు. గంగాధర్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం జరిపించామనీ, ఆయన మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని ఎస్పీ పేర్కొన్నారు. వంటిపై ఎలాంటి గాయాలు లేనందున ఆయన మరణం అనారోగ్యం కారణాలతోనే సంభవించి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు ఎస్పీ ఫకీరప్ప.

సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు

వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి అనుచరుడైన గంగాధర్ రెడ్డి గతంలో సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బెదిరించారనీ, తనకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీంతో పోలీసులు అతని ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పెట్టించి నిఘా ఏర్పాటు చేశారు.


Share
somaraju sharma

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

24 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

54 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago