NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Andhra Pradesh: ఏపీలో చిత్ర విచిత్రం… సొంత పార్టీ నేత‌లు నో.. ప‌క్క పార్టీ నేత‌ల ఫైర్‌

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న రాజ‌కీయం గురించి ఇప్పుడు విశ్లేష‌కులు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు అభియోగాలతో ఎంపీని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు సెలెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. అయితే, ఈ విష‌యంలో సొంత పార్టీ నేత‌లు ఓ ర‌కంగా రియాక్ట్ అవుతుంటే…ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇంకో ర‌కంగా మాట్లాడుతున్నాయి.

 

ర‌ఘురామ‌కృష్ణంరాజు విష‌యంలో ఆ రాష్ట్ర ప్ర‌ముఖుల ఎంట్రీ

ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు ఎద్దేవా చేశారు. ఘురామ కృష్ణం రాజుపై దాడి నిర్ధారణ అయితే అది పార్లమెంట్ పై దాడిగానే పరిగణించాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయ‌న్న బీజేపీ నేత‌.. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు తగిలిన గాయాల‌పై ఇతర రాష్ట్రాల‌కు చెందిన ప్రముఖ వైద్యుల బృందంతో నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాల‌ని కోరారు. కక్ష సాధింపు చర్యలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు మినహాయింపు కాదని రఘురామ కృష్ణంరాజు అరెస్ట్, తర్వాత పరిణామాలు హెచ్చరికాగా క‌నిపిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

జన‌సేన కూడా త‌క్కువ తిన‌లేదు…

ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు.

AP Politics: YSRCP in Trouble in MP Arrest

వైసీపీ ఏం చెప్తోందంటే…

రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపి నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంతో రఘురామ కృష్ణంరాజు కుమ్మక్కై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని.. అతని భాష వింటే ఎంపి అని చెప్పటం కూడా సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు. రఘురామ వెనుక కథ, కర్మ, కర్త, క్రియ అంతా చంద్రబాబే అని.. తానే ఇదంతా చేయించిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు బయటపెట్టేస్తాడేమో అన్న భయం చంద్రబాబులో కనిపిస్తోందని ఆరోపించారు. మొత్తంగా అరెస్ట్ చేసింది ysr ఎంపీని అయితే దాన్ని ఖండిస్తోంది బీజేపీ, టీడీపీ , జ‌న‌సేన స‌హా మిగ‌తా ప్ర‌తిప‌క్షాలు కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

author avatar
sridhar

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju