29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల

Share

ఏపిలో కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇవేళ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 4,59,182 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయగా, వారిలో 95,208 మంది ఉత్తీర్ణులైయ్యారు. 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా ఫలితాలను slprb.ap.gov,in లో పొందవచ్చని పేర్కొంది.

AP Police

 

కాగా గత నెల 22న పరీక్ష ముగిసిన వెంటనే ప్రిలిమినరీ కీని విడుదల చేయగా, 2261 అభ్యంతరాలు వచ్చాయనీ, వాటిని సబ్జెక్ట్ నిపుణులతో చర్చించి అవసరమైన వాటిని పరిగణలోకి తీసుకుంటామని బోర్డు పేర్కొంది. అభ్యర్ధుల ఒఎంఆర్ షీట్స్ ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుండి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. స్టేట్ టు ఆన్ లైన్ అప్లికేషన్ ధరఖాస్తును ఈ నెల 13వ తేదీ సాయంత్రం 3 గంటల నుండి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ సైటడ్ లో అందుబాటులో ఉంటుందని బోర్డు పేర్కొంది. అభ్యర్ధులు తమ అనుమానాల నివృత్తికి హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323 కి లేదా [email protected] మెయిల్ లో సంప్రదించాలని బోర్డు తెలిపింది.

Earth Quake: నిజామాబాద్ లో భూకంపం .. భయంతో ప్రజలు పరుగులు


Share

Related posts

బ్రేకింగ్ : మోడీ కి భారీ షాకిచ్చిన జగన్..! అర్థాంతరంగా ఆగిపోయిన సమావేశం

arun kanna

ఏపీ ప్రభుత్వ జీవోతో పాలమూరు ప్రాజెక్టులకు జల గండమా?

Siva Prasad

మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు

Siva Prasad