Rain Alert: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుండి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ కొనసాగుతున్న ద్రోణితో పాటు నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు (శని, ఆది, సోమవారం) ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లానే గంటకు 40 నుండి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

శనివారం (నేడు) మాత్రం కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలపై విపత్తు నిర్వహణ సంస్థ ఎండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అలర్ట్ చేశారు. ఐఎండీ అంచనాల ప్రకారం శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రేపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద ఉండరాదని తెలిపారు. ఒ వైపు ఎండలు మండుతున్న ఈ తరుణంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో వాతావరణం చల్లగా మారనున్నది.
YSRCP: ఏపిలో టీడీపీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీదే హవా అని పేర్కొన్న టైమ్స్ నౌ సర్వే