NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Dhulipalla: వదల బొమ్మాళీ నిన్ను వదల..!!

Dhulipalla: వదల బొమ్మాళీ నిన్ను వదల అన్నట్లు…గుంటూరు జిల్లా టీడీపీ నేత దూళిపాళ నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం ప్రయోగించింది. ఇంతకు ముందు సంగం డెయిరీలో చైర్మన్ హోదాలో ఉన్న దూళిపాళ్ళ నరేంద్ర అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఆనంతరం ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఆ తరువాత ఆయన విజయవాడలోని ఓ హోటల్ లో సంగం డెయిరీ బోర్డు మీటింగ్ ఏర్పాటుకు సమావేశమైతే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వం సంగం డెయిరీని ఏపి పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ జీవోను విడుదల చేసింది.

Another weapon against TDP Leader Dhulipalla Narendra
Another weapon against TDP Leader Dhulipalla Narendra

Dhulipalla: డీవీసీ ట్రస్ట్ స్వాధీనానికి నోటీసు

సదరు ప్రభుత్వ జీవోపై చైర్మన్ దూళిపాళ్ళ నరేంద్ర హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన జివోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని దూళిపాళ్ళ నరేంద్ర నింపాదిగా ఉండగా… ప్రభుత్వం ఇప్పుడు ఆయనపై మరో అస్త్రం ప్రయోగించింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగం డెయిరీకి అనుబంధంగా డీవీసీ ఆసుపత్రి నడుస్తొంది అన్నది అందరికీ తెలిసిందే. పాల రైతులకు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం రాయితీతో డీవీసీ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోంది. ఈ ట్రస్ట్ కు దూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా ఉన్నారు.

సంగం డెయిరీ సాధ్యం కాలేదు.. ట్రస్ట్ ఏమవుతుందో..?

అయితే తాజాగా పాల రైతులకు ఉపయోగపడుతున్న ఈ డీవీసీ మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని 6 ఏ కింద ట్రస్ట్ ఎందుకు స్వాధీననం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ ఈ నోటీసులను జారీ చేశారు. వారం రోజుల్లో ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాలని కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గతంలో సంగం డెయిరీ స్వాధీనానికి ప్రయత్నించి భంగపడిన ప్రభుత్వం..ఇప్పుడు మరో విధంగా డీవీసీ మెమోరియల్ ట్రస్ట్ స్వాధీనానికి అడుగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకోంది. దీనిపై దూళిపాళ నరేంద్ర, ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఓ పక్క రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఒకటి తరువాత ఒకటిగా దూళిపాళ నరేంద్ర పై జరుగుతున్న ప్రభుత్వ చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?