AP 10th, Inter Exams: ఏపిలో పరీక్షలు నిర్వహణ పక్కా..! విద్యార్థులూ సిద్ధం కండి..!!

AP 10th, Inter Exams likely in July end
Share

AP 10th, Inter Exams: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటి వరకూ కొంత సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల మాదిరిగానే పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పరీక్షలు రద్దు చేసే అలోచన లేదని స్పష్టం చేస్తూనే వచ్చింది. అయితే ఇటీవల కాలంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదనీ, వచ్చే నెలలో ఉండవచ్చు, కరోనా పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. కశ్చితంగా పరీక్షలు నిర్వహిస్తామని మాత్రం చెప్పలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై ఇతర రాష్ట్రాల మాదిరిగా ఏపి కూడా నిర్ణయం తీసుకోవచ్చునేమో అని చాలా మంది భావించారు.

AP 10th, Inter Exams likely in July end
AP 10th, Inter Exams likely in July end

Read More: CM YS Jagan: చిరు ట్వీట్‌కి జగన్ స్పందన ఇదీ..!?

అయితే ముందు నుండి చెబుతున్నట్లుగా ఏపి ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో రద్దు అలోచన లేదని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీం కోర్టుల అఫిడవిట్ కూడా దాఖలు చేయడంతో ఇక రాష్ట్రంలో పరీక్షల రద్దు అనే ప్రసక్తేలేదనీ, పరీక్షలు నిర్వహించడం పక్కా అని తేలిపోయింది. వచ్చే నెల జూలై చివరి వారంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పేసింది. పరీక్షలు నిర్వహించే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా తెలియజేసింది. ఒక్కో పరీక్షా కేంద్రంలోని ఒక్కో హాలులో 15 నుండి 18 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అఫిడవిట్ లో ఏపి ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ నిర్ణయం ఈ విధంగా ఉండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరీక్షలు రద్దు చేయాలంటూ మరో సారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ ద్వారా లక్షల మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పరీక్షలు రద్దు చేయని ఏకైక రాష్ట్రం ఏపియేనని అన్నారు. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తే సీఎంకి తాను రాసిన ప్రతి లేఖను వెనక్కి తీసుకునేందుకు సిద్ధం అని పేర్కొన్నారు. మొండితనంతో 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ప్రభుత్వానికి తగదనీ, ఏ విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా సీఎందే బాధ్యత, దాన్ని ప్రభుత్వ హత్యగానే పరిగణించాల్సి వస్తుందని లోకేష్ హెచ్చరించారు.


Share

Related posts

పోటీ కి రెడీ అవుతున్న బాలయ్య బాబు- చిరంజీవి..??

sekhar

ప్రముఖ సంగీత దర్శకుడు హఠాన్మరణం

Teja

Viral Image: వింత జంతువు అని దగ్గరికి వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు.. ఎందుకంటే..

bharani jella