NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session 2022: ఏపి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన..టీడీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళం

AP Assembly Budget Session 2022: ఏపి అసెంబ్లీ బడ్జెట్ నాల్గవ రోజు సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైయ్యాయి. అసెంబ్లీ మొదలవ్వగానే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022 – 23 వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. కోవిడ్ పరిణామాల తర్వాత ప్రజలను అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకువెళ్తోందని అన్నారు. నవరత్నాలు, సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. రూ.2,56,256 కోట్లతో 2022 – 23 కోట్లతో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూల ధనం వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా పేర్కొన్నారు.

AP Assembly Budget Session 2022 Updates
AP Assembly Budget Session 2022 Updates

AP Assembly Budget Session 2022: బడ్జెట్ లో కేటాయింపులు ఇలా..

  • వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.18వేల కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ రైతు భరోసా రూ.3,900 కోట్లు కేటాయింపు
  • వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ.20,962 కోట్లు కేటాయింపు
  • వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖకు రూ.11,387 కోట్లు కేటాయింపు
  • పాల ఉత్పత్తి, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖకు రూ.1,568 కోట్లు కేటాయింపు
  • ఉన్నత విద్యకు రూ.2,014 కోట్లు కేటాయింపు
  • ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రూ.10,201 కోట్లు కేటాయింపు
  • ఇంథన రంగానికి రూ.10,281 కోట్లు కేటాయింపు
  • జనరల్ ఎకో సర్వీసెస్ కు రూ.4,420 కోట్లు కేటాయింపు
  • ఇండస్ట్రీ అండ్ మినరల్స్ కు రూ.2,755.17 కోట్లు కేటాయింపు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630 కోట్లు కేటాయింపు
  • ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ కు రూ.11,482 కోట్లు కేటాయింపు
  • గ్రామీణాభివృద్దికి రూ.17,109 కోట్లు కేటాయింపు
  • సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.685 కోట్లు కేటాయింపు
  • ట్రాన్స్ పోర్టు రంగానికి రూ.9,617 కోట్లు కేటాయింపు
  • మొత్తంగా ఆర్ధిక సేవల రంగానికి రూ.69,306 కోట్లు కేటాయింపు
  • పర్యావరణ, అటవీ శాఖకు రూ.685.36 కోట్లు కేటాయింపు
  • వ్యవసాయ రంగానికి రూ.11,387.69 కోట్లు కేటాయింపు
  • సాధారణ సర్వీసులకు రూ.73,609 కోట్లు కేటాయింపు
  • జగనన్న వసతి దీవెనకు రూ.2,083 కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ – పీఎం ఫసల్ భీమా యోజన కు రూ.1,802 కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ ఆసరా కోసం రూ.6400 కోట్లు
  • వైఎస్ఆర్ స్వయం సహాకార సంఘాలు (గ్రామీణ) ఉచిత వడ్డీ రహిత రుణాలు రూ.600 కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ స్వయం సహకార సంఘాల (అర్బన్) ఉచిత వడ్డీ రహిత రుణాలు రూ.200 కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ వడ్డీ రహిత రైతు రుణాలు రూ.500 కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.500 కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ జగనన్న తోడు రూ.25కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ జగనన్న చేదోడు రూ.300 కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ వాహన మిత్ర  రూ.260కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం  రూ.199 కోట్లు కేటాయింపు
  • వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.120.49 కోట్లు కేటాయింపు
  • మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు కేటాయింపు
  • రైతుల ఎక్స్ గ్రేషియా రూ.20 కోట్లు కేటాయింపు
  • లా నేస్తం రూ.15 కోట్లు కేటాయింపు
  • అమ్మ ఒడి రూ.6,500 కోట్లు కేటాయింపు
  • ఉన్నత విద్య రూ.2,014 కోట్లు కేటాయింపు
  • సెకండరీ ఎడ్యుకేషన్ రూ.27,706.66 కోట్లు
  • పౌరసరఫరాల శాఖ కు 3,719.24 కోట్లు
  • ఫైనాన్స్ రూ.58,583.61 కోట్లు కేటాయింపు
  • జీఏడీ రూ.998.55 కోట్లు
  • సచివాలయ వ్యవస్థ కు రూ.3,396.25 కోట్లు
  • అర్చకులకు రూ.122 కోట్లు కేటాయింపు
  • బ్రాహ్మణ కార్పోరేషన్ కు రూ.455.23 కోట్లు కేటాయింపు
  • కమ్మ వెల్ఫేర్ కార్పోరేషన్ కు రూ.1899.74 కోట్లు కేటాయింపు
  • రెడ్డి వెల్ఫేర్ కార్పోరేషన్ కు రూ.3,088 కోట్లు కేటాయింపు
  • క్రిస్టియన్ కార్పోరేషన్ కు రూ.11.34 కోట్లు కేటాయింపు
  • వైశ్య కార్పోరేషన్ కు ర.915.49 కోట్లు కేటాయింపు
  • క్షత్రియ వెల్ఫేర్ కార్పోరేషన్ కు రూ.314.02 కోట్లు కేటాయింపు
  • మైనారిటీ సంక్షేమం కు రూ.1750.50 కోట్లు కేటాయింపు
  • కాపు కార్పోరేషన్ కు రూ.3,531 కోట్లు కేటాయింపు

 

 

కాగా మంత్రి బుగ్గన ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు గొడవ చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ సభ్యుల రన్నింగ్ కామెంటరీపై బుగ్గన, స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వినే ఓపిక లేకపోతే టీడీపీ సభ్యులు సమావేశం నుండి బయటకు వెళ్లిపోవచ్చని మంత్రి బుగ్గన అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!