NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session: డ్యామేజీ కంట్రోల్ అయినట్లే(గా)..?

AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ఇటీవల అకాల మరణం చెందిన మంత్రి గౌతమ్ రెడ్డికి మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. అయితే ఇదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, సుధీర్ఘకాలం మంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా పని చేసిన రోశయ్య మృతికి అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశం పెట్టి నివాళులర్పించకపోవడం రాష్ట్రంలో ఆర్యవైశ్య సంఘీయులకు ఆగ్రహం తెప్పించింది. ఆ సంఘ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చివరి వరకూ వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉన్న రోశయ్య కు అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టకపోవడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. రోశయ్య మృతి చెందిన సందర్భంలోనూ సీఎం వైఎస్ జగన్ వెళ్లి నివాళులర్పించకపోవడాన్ని పలువురు ఆర్యవైశ్య సంఘ నేతలు ప్రస్తావించారు.

AP Assembly Budget Session CM Jagan pays tribute former cm Rosaiah
AP Assembly Budget Session CM Jagan pays tribute former cm Rosaiah

 

AP Assembly Budget Session: ఆర్యవైశ్య సంఘ నేతల్లో నిరసన

రోశయ్యను విస్మరిస్తే ఆర్యవైశ్యులు వైసీపీకి దూరమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆర్యవైశ్య సంఘ నేతల్లో నిరసన వ్యక్తం అవ్వడంతో వైసీపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో మూడవ రోజైన గురువారం నాడు కొణిజేటి రోశయ్య మృతికి సంతాప తీర్మానం ప్రవేశెట్టారు. ఈ సందర్బంలో రోశయ్య ఘనతను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కొనియాడారు. విద్యార్ధి నాయకుడు స్థాయి నుండి శాసనమండలి సభ్యుడుగా, శాసనసభ్యుడు, మంత్రిగా, ఎంపిగా, ముఖ్యమంత్రి, చివరకు గవర్నర్ గానూ కొనసాగిన ఘనత రోశయ్యది అని సీఎం జగన్ అన్నారు. ఆయన ఏ బాధ్యత నిర్వహించినా అందరికీ ఆదర్శంగా, అందరూ కొనియాడే మనిషిగానే నిలిచారని కీర్తించారు.

అయిదుగు సీఎంల వద్ద మంత్రిగా చేసిన ఘనత

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆయన మంత్రిగా పని చేశారన్నారు. వైఎస్ఆర్ తో మంచి సంబంధాలు ఉండేవన్నారు. మంచి స్నేహితులుగా ఉండేవారనీ, అలాంటి రోశయ్య గుర ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు వైఎస్ జగన్. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి తదితరులు సంతాప తీర్మానంపై మాట్లాడారు. అదే విధంగా మృతి చెందిన పలువురు సభ్యులకు సంతాపం తెలియజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!