NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

15 నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు .. ఈ సమావేశాల్లో పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లు..?

ఈ నెల 15వ తేదీ నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే నిర్వహించే బీఏసీ సమావేశం లో అసెంబ్లీ పని రోజులపై నిర్ణయం తీసుకుంటారు.

 ap assembly
ap assembly

 

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల అంశంపై ఏపి హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంది. అయితే అదే సందర్భంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా మెరుగైన విధంగా మూడు రాజధానుల బిల్లు తీసుకువస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించి ఉన్నారు. రీసెంట్ గా మంత్రి గుడివాడ అమరనాథ్ తో సహా పలువురు మంత్రులు మూడు రాజధానుల ఏర్పాటే తమ పార్టీ, ప్రభుత్వ విధానమని స్పష్టం చేయడంతో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ap three capitals

 

గతంలో శాసనసభలో ఆమోదం పొందిన బిల్లు శాసనమండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో పాస్ కాలేదు. ఇప్పుడు శాసనమండలిలోనూ అధికార పార్టీకి సంఖ్యాబలం ఉండటంతో ఉభయ సభల్లో మూడు రాజధానుల అంశానికి సంబంధించి కొన్ని మార్పులతో ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదించుకునే అవకాశం ఉందని అంటున్నారు. గత సమావేశంలో చట్టసభల అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యంపై సుదీర్ఘంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమావేశాల్లో మరి కొన్ని కీలక బిల్లులను సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Read More: AP Three Capitals: వికేంద్రీకరణ విషయంలో తగ్గేదెలే..! అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్..కోర్టు తీర్పుపై ఏమన్నారంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju