NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Assembly sessions: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..! కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ..!!

AP Assembly sessions: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. 2021 -2022 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 2 లక్షల 11వేల కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ ను అసెంబ్లీలో  ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత కె అచ్చెన్నాయుడు తెలిపారు. తూతూ మంత్రంగా ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హజరు కాలేమని అన్నారు. ఆరు నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. బడ్జెట్ పై పూర్తి స్థాయి చర్చ జరగకుండా తూతూ మంత్రంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కరోనా కట్టడి కోసం సీఎం జగన్మోహన రెడ్డి ఆలోచించడం లేదని విమర్శించారు.

AP Assembly sessions tdp boycott
AP Assembly sessions tdp boycott

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక్క సారి అయినా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.  పక్క రాష్ట్రాలను చూసి అయినా సీఎం జగన్ నేర్చుకోవాలన్నారు.  ప్రతిపక్ష నేతల సూచనలు, సలహాలు తీసుకోవాలన్న ఆలోచన జగన్ చేయాలన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లనే ఆక్సిజన్ అందక రాష్ట్రంలో 106  మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు పడకలు, మందులు, ఆహారం అందడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమిళనాడు, కేరళ తరహాలో కరోనా రోగులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో అక్కడి సీఎం స్టాలిన్  కరోనా పరిస్థితులపై అఖిలపక్ష నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju