NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: టీడీపీ సభ్యులు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ స్పీకర్ తమ్మినేని ఆగ్రహం..రెండు రోజుల సస్పెన్షన్

AP Assembly: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 11వ రోజైన బుధవారం టీడీపీ సభ్యులు కల్తీ మద్యంపై గొడవ కొనసాగిస్తున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిడతలు వాయిస్తూ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. పలు మార్లు స్పీకర్ వారించినా టీడీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. అధికార పక్ష సభ్యులు, మంత్రులు టీడీపీ సభ్యుల తీరును తప్పుబడుతూ వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. సభ సజావుగా జరగాలంటే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాల్సిందేనన్నారు. స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యుల నుండి చిడతలను మార్షల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు.

AP Assembly TDP MLAs suspension for 2days
AP Assembly TDP MLAs suspension for 2days

Read More: AP Assembly Budget Session: అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు..స్పీకర్ తమ్మినేని సీరియస్

AP Assembly: టీడీపీ సభ్యులు రెండు రోజుల పాటు సస్పెండ్

టీడీపీ సభ్యులు ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారంటూ వారి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభా నిర్వహణకు నిమిషానికి 88,902 లు ఖర్చు అవుతుందని తెలుసా అంటూ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు స్పీకర్ తమ్మినేని. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని. పదేపదే సభా కార్యక్రమాలను అడ్డుతగలడంతో పాటు ఈలలు వేయడం, చిడతలు తెచ్చి వాయించడం వంటివి సభా గౌరవ మర్యాదలను కించపర్చే విధంగా ఉన్నాయని స్పీకర్ అన్నారు.

 

టీడీపీ సభ్యుల అనుచిత చర్యలపై ఎథిక్స్ కమిటీ విచారణ

మరో పక్క టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన పై ఎథిక్స్ కమిటీ విచారించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశాలు జారీ చేశారు. ఎథిక్స్ కమిటీ విచారించి తగిన చర్యలు సూచించాలని స్పీకర్ కోరారు. స్పీకర్ పైనే కాగితాలు చించి విసిరివేయడం, ఈలలు వేయడం, చిడతలు వాయించడం లాంటి చర్యలను స్పీకర్ తమ్మినేని సీరియస్ గా పరిగణించారు. ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు చర్యలు ఉంటాయని స్పీకర్ వెల్లడించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju