NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేరళలో ఏపి అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా .. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా

కేరళలో ఏపి అయ్యప్ప దీక్ష స్వాములు ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రైవేటు టూరిస్ట్ బస్సులో శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లారు. వీరు తిరుగు ప్రయాణంలో ఉండగా, పతనంథిట్ట జిల్లా లాహల్యాంప్ బోటు ప్రాంతం బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని పత్తనంథిట్ట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది యాత్రికులు ఉన్నారు. క్షతగాత్రులు ఏలూరు మండలం మాడేపల్లి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.

Road Accident

 

బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియడంతో దీక్షా స్వాముల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అక్కడి జిల్లా కలెక్టర్, అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఫోన్ లో మాట్లాడారు. గాయపడిన వారి వివరాలు, క్షేమంగా బయటపడిన వివరాలను తెలుసుకున్నారు. బస్సు ప్రమాద ఘటనపై ఏపి సీఎం జగన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N