Somu Veerraju: వైసీపీ నేతల విమర్శలపై సోము ఫైర్ .. తాను చిట్టా విప్పితే చొక్కాలు ఊడిపోతాయంటూ సంచలన వ్యాఖ్యలు..

Share

Somu Veerraju: ఏపి బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రజాగ్రహ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఈ సభ నిర్వహణపై మంత్రులు పేర్ని నాని, బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తదితరులు విమర్శలు గుప్పించారు. ఆ నేతల విమర్శలపై బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. తమ్ముడు పేర్ని నానికి వినమ్రంగా చెప్పున్నా..మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి, మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అలాగే మంత్రి కొడాలి నాని చేతికి తాళ్లు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ అంటూ సెటైర్ వేశారు. మా పార్టీ ఎవరో ఎంపీకీ లీజుకు ఇచ్చామని మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన వారికి మీరు ఏమి లీజులు ఇచ్చారో చెప్పమంటావా, మీ లీజుల గురించి మేము మాట్లాడితే చొక్కాలు ఊడిపోతాయి. మా పార్టీ కార్యాలయాల అద్దెలపై మాట్లాడుతున్నారు. మీ అద్దెలు ఎవరు కడుతున్నారో అందరికీ తెలుసు, బద్వేల్, తిరుపతి ఎన్నికలపై చర్చద్దాం దమ్ముంటే రండి సోము వీర్రాజు సవాల్ విసిరారు. అంత భయం లేకపోతే బద్వేల్ లో ఓటర్లకు డబ్బులు ఎందుకు పంచారని ప్రశ్నించారు.

Ap Bjp chief Somu Veerraju counter comments on ycp

 

Somu Veerraju: తమ్మినేని.. ఆ ప్రాజెక్టులపై పోరాటం చేయండి

తమ్మినేని సీతారాం స్పీకర్ అన్న విషయాన్ని మరిచి మాట్లాడుతున్నారన్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ పై పోరాటం మాని ఆయన జిల్లాలోని తోటపల్లి, వంశధార ప్రాజెక్టులపై పోరాటం చేయాలని సోము వీర్రాజు సూచించారు. మంత్రి బొత్సా సత్యనారాయణకు బీజేపీ చరిత్ర గురించి ఏమి తెలుసునని అన్నారు. రాజకీయ ఉనికి కోసం పార్టీలు మారే వారు అందరూ బీజేపీ గురించి మాట్లాడేవారే అంటూ సోము విమర్శించారు. పదవులు అవసరం లేదనుకున్న వారు వచ్చి బీజేపీలో చేరవచ్చంటూ బొత్సాను సోము వీర్రాజు ఆహ్వానించారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించి ప్రజలకు మేలు చేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పేదలు తినే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించరా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదలు తినే తిండికన్నా వినోదమే ముఖ్యమైన అంశమా అని ప్రశ్నించారు.  బీజేపీ పొత్తుతో 2014లో అధికారంలోకి వచ్చిన విషయాన్ని పయ్యావుల కేశవ్ మర్చిపోయారా అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ పోరాటం

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఇకపై బీజేపీ దూకుడుగా వెళుతుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇదే క్రమంలో మద్యంపై చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు సమర్ధించుకున్నారు. తాను తక్కువ ధరకే మద్యం అమ్ముతానని చెప్పింది రాష్ట్రంలోని ఆడపడుచుల కోసమేనన్నారు. ప్రభుత్వం రూ.250లకు మందు అమ్మి పేదవాడి రక్తం తాగుతోందని మండిపడ్డారు. పేదల బలహీనతను వైసీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మందు రేట్లు తగ్గిస్తా అన్నది.. వచ్చే కూలీ డబ్బుల్లో కొంతైనా ఇంట్లో ఇస్తారని మాత్రమేనని సోము వీర్రాజు అన్నారు.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

7 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago