NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: సోము సారుకి కోపం చిర్రెత్తుకొచ్చింది..! పోలీసులపై సీరియస్.. వీడియో వైరల్

Somu Veerraju: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పోలీసులపై కోపం చిర్రెత్తుకొచ్చింది. ఎస్ఐ సహా పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐని తోసేస్తూ మరీ మీదకు వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయంలోకి వెళితే..అమలాపురం అల్లర్ల బాధితులు, కేసు నమోదైన బాధితుల కుటుంబాల పరామర్శించేందుకు సోము వీర్రాజు వెళుతుండగా తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉందనీ, అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సోము కారు కదలకుండా మరో వాహనాన్ని పోలీసులు అడ్డుపెట్టారు. దాదాపు అరగంట పాటు జొన్నాడ వద్ద సోము వీర్రాజును పోలీసులు ఆపేశారు.

AP BJP Chief Somu Veerraju Fires on Police Officials
AP BJP Chief Somu Veerraju Fires on Police Officials

Read More: Pawan Kalyan: టెన్త్ విద్యార్ధులకు హాపీ న్యూస్ ..ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కీలక సూచన

Somu Veerraju: వ్యక్తిగత స్వేచ్చను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు..?

దీంతో ఆ వాహనాన్ని పక్కకు తీయాలంటూ పోలీసులపై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు నిలుపుదల చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను తోసేశారు. వ్యక్తిగత స్వేచ్చను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ ప్రశ్నించారు. ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీతోనూ మాట్లాడి అనుమతించాలని కోరారు. ఆ తరువాత రావులపాలెం వెళ్లేందుకు మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శిస్తుంటే పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు ప్రభుత్వ పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయని విమర్శించారు సోము వీర్రాజు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి రాష్ట్ర పాలన దిగజారిందనే విషయాన్ని ప్రభుత్వ చర్యలు అద్దం పడుతున్నాయని సోము వీర్రాజు పేర్కొన్నారు.

ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రతిపాదన నేపథ్యంలో అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం, ఆ నేపథ్యంలోనే విధ్వంసకర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ అల్లర్ల కేసులో ఇప్పటికే పోలీసులు వివిధ పార్టీలకు చెందిన వంద మందికిపైగా అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీలకు చెందిన వారు ఉన్నారు.

Somu Veerraju: సోము వీర్రాజుపై కేసు నమోదు

కాగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. వాహనాన్ని పోలీసులు నిలుపుదల చేసిన క్రమంలో సోము వీర్రాజు అక్కడ ఉన్న ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించారు. అక్కడ జరిగిన ఘటన మొత్తాన్ని పోలీసులు తమ సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించారు. ఆ సాక్షం మేరకు ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju