Somu Veerraju: అసెంబ్లీలో చంద్రబాబు ఎపిసోడ్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ట్వీట్ సూపరో సూపర్..! మీరు ఓ లుక్కేయ్యండి..!!

Share

Somu Veerraju: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పక్ష నేతలు వ్యవహరించిన తీరుకు ఆయన తీవ్ర మనస్థాపానికి గురై వాకౌట్ చేయడం, మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతా.. లేకుంటే ఈ రాజకీయాలే అవసరం లేదంటూ బీషణ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లపర్యంతం అయ్యారు. తన భార్యను అవమానించే రీతిలో వైసీపీ నాయకులు మాట్లాడటం తీవ్ర ఆవేదన కల్గించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేసింది. మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబులు తదితరులు చంద్రబాబును వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడటాన్ని వివిధ రాజకీయ పక్షాల నేతలు ఖండించారు.

ap bjp chief Somu Veerraju tweet on chandra babu episode
ap bjp chief Somu Veerraju tweet on chandra babu episode

Somu Veerraju: ఖండించిన వివిధ రాజకీయ పక్షాల నేతలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, బీజేపీ నేతలు దగ్గుబాటి పురందరేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితర నేతలు ఖండించారు. టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. అయితే ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వినూత్నంగా స్పందించారు. తొలి నుండి టీడీపీ, చంద్రబాబును వ్యతిరేకించే సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా తనదైన స్టైల్ లో స్పందిస్తూ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కల్గించడంతో పాటు చర్చనీయంశం అవుతోంది. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సోము వీర్రాజు చేసిన ట్వీట్ ఏమిటంటే…

సభా గౌరవాన్ని దిగజారుస్తున్నారు

“శాసనసభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత సభకు ఎన్నికైన ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. ఇటీవలి కాలంలో సభ్యులు తమను గెలిపించిన ప్రజల సమస్యలపై చర్చించడం మానేసి, తమ నాయకుడికి భజన చేసుకుంటూ లేదంటే ప్రతిపక్ష సభ్యులను, నాయకుడిని హేళన చేసుకుంటూ పోటీలు పడి మరి సభా గౌరవాన్ని దిగజారుస్తున్నారు” అని పేర్కొన్నారు. కానీ “సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును అది అధికార పార్టీ సభ్యులైనా, ప్రతిపక్ష పార్టీ సభ్యులైనా సమాజం మొత్తం గమనిస్తూ ఉంటుంది. మనం ప్రవర్తిస్తున్న తీరు సభ గౌరవాన్ని పెంచకపోయినా ఫరవాలేదు కానీ దిగజార్చకుండా ఉంటే చాలు. ఒకరి నొరకు పోటీలుపడి దూషించుకోవటానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించలేదు” అని అన్నారు.

ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి

సభా నాయకుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు కానీ, సభ అధ్యక్షులు కానీ ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా చర్చించి, వాటికి తగిన పరిష్కారాలను చూపినప్పుడే సభ గౌరవం పెరుగుతుంది. ప్రజల ఓటుకు సార్ధకత చేకూరుతుంది. వారి మనసులో స్థానం లభిస్తుంది అని పేర్కొన్నారు. “ఇలాంటి నాయకుడికా నేను ఓటు వేసలి శాసనసభకు పంపిచాను అని ఓటు వేసిన ప్రజలు ఈసడించుకోకముందే, సభ గౌరవాన్ని కాపాడటానికి ఎన్నికైన ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేస్తారని ఆశిస్తున్నాను” అని సోము ట్వీట్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ జరిగిన సంఘటనలు పునరావృత్తం కాకుండా సభా నాయకుడైన ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలని సోము వీర్రాజు విజ్ఞఫ్తి చేశారు. సోము వీర్రాజు చాలా క్లాటకారికల్ గా తప్పు ఇరు పార్టీలదీ ఉంది అన్నట్లుగా పెద్ద మనిషిగా సూచన ఇచ్చారు.


Share

Related posts

పాక్ జైళ్లలో 537 మంది ఇండియన్లు

Siva Prasad

Sharukh khan : షారుఖ్ ఖాన్ నుంచి 2022లో రెండు భారీ ప్రాజెక్ట్స్

GRK

Anchor Meghana : రెచ్చిపోదాం బ్రదర్ అంటున్న యాంకర్ మేఘన?

Varun G