NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో రాజకీయ పొత్తుల కలకలం ..జనసేన విషయంలో బీజేపీ స్టాండ్ అదే(నట)..!

ఏపిలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీల పొత్తుల అంశంపై రకరకాల కథనాలు వినబడుతున్నాయి. విశాఖలో జరిగిన పరిణామం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంతో టీడీపీ – జనసేన బంధం బహిర్గతం అయ్యిందంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రోడ్ మ్యాప్ పై బీజేపీ స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించారు. దీంతో బీజేపీతో జనసేన దూరం అవుతోందనీ, టీడీపీతో జత కడుతుందని టీవీల్లో డిబేట్ లు ప్రారంభం అయ్యాయి. ఇదే తరుణంలో సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. బీజేపీ తో జనసేన పొత్తు దెబ్బతింటే అందుకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే కారణమనే విధంగా కన్నా వ్యాఖ్యానించారు.

BJP Janasena

 

ఏపిలో అధికార వైసీపీని ఢీకొట్టాలంటే ప్రజాబలం, ఓటు బ్యాంకు లేని బీజేపీతో కలిసి పోరాటం చేస్తే సరిపోదన్న భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముక్కోణపు పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల అధికార వైసీపీకే లాభం చేకూరుతుందన్న ఆలోచనలో జనసేన ఉంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయకూడదు అన్న భావనలోనే వైసీపీ కూడా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్దులను పోటీకి నిలపాలని ఛాలెంజ్ విసురుతున్నారు.

sunil deodhar

 

అయితే తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ ఏపి కోఆర్డినేటర్ సునీల్ ధియోధర్ స్పందించారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని ఆయన మరో మారు స్పష్టం చేశారు. వైసీపీ – టీడీపీ ల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. వైసీపీ – టీడీపీ లు రెండూ దొంగల పార్టీలేనని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదు అంటూ తేల్చి చెప్పారు. వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెబుతూనే రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు ధియేధర్. విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు చాలా మంది పవన్ తో మాట్లాడారనీ సంఘీభావం తెలిపారని అన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju