NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP BJP: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోముకు షాక్..! పార్టీ కేంద్ర అధిష్టానం ఏమి చేసింది అంటే..?

AP BJP: ఏపి బీజేపీలో ఇకపై ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పాలన్న నిర్ణయంతో కేంద్ర అధిష్టానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ ముఖ్యనేతలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారనీ, ఇతర పార్టీల నుండి పార్టీలో చేరిన నేతలకు గౌరవం ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి. అమరావతి రైతుల మహా పాదయాత్రలో తొలుత పాల్గొనకపోవడం, ఒక మీడియాను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం, టీడీపీ నుండి చేరిన నేతలకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తదితర విషయాలపై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఇకపై మొత్తం కోర్ కమిటీ సభ్యులను సంప్రదించకుండా ఏపిలో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఏపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటించారు.

AP BJP core committee
AP BJP core committee

 

Read More: Viveka Murder Case: వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ …! సీబీఐ అధికారులపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన గంగాధర్ రెడ్డి..!!

AP BJP: కోర్ కమిటీ సభ్యులు వీళ్లే

కోర్ కమిటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి దుగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవిఎల్ నర్శింహరావు, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) మధుకర్, ఎమ్మెల్సీ పీఎన్వీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి ఉన్నారు. ప్రత్యేక అహ్వానితులుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యవేక్షకుడు శివప్రకాశ్, కేంద్ర మంత్రి, రాష్ట్ర ఇన్ చార్జి వి మురళీధరన్, సునీల్ ధియోధర్ హజరవుతారు.

 

ఇటీవల తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీకి హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై సమీక్ష జరిపారు. పలు సూచనలు చేశారు. ఆ  తరువాతనే బీజేపీ నేతలు అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన సంగతి తెలిసిందే.

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?