NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meeting: ఏపి కేబినెట్ అత్యవసర భేటీ..! మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం కోసమేనా..?

AP Cabinet Meeting: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటిలో కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులు కేబినెట్ సమావేశానికి హజరుకావాలని ఆదేశాలు అందాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమవేశాలను నేటితో ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అత్యవసర కేబినెట్ బేటీలో కేబినెట్ బేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం.  ఇదే సమావేశంలో మూడు రాజధానుల అంశంపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కేబినెట్ ఆమోదించిన సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు స్టే ఇవ్వడం, ప్రస్తుతం హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

AP Cabinet emergency Meeting
AP Cabinet emergency Meeting

దీంతో ఈ బిల్లును వెనక్కు తీసుకుని కొన్ని మార్పులతో మళ్లీ శాసనసభలో మూడు రాజధానుల బిల్లు పెట్టే ఆలోచనను సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం శాసనమండలిలోనూ వైసీపీ బలం పెరిగిన కారణంగా కొద్ది మార్పులతో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ, మండలిలో ఆమోదించి ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇదే క్రమంలో వరద కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను అదుకునే అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

కొద్దిసేపటి క్రితమే వరద సహాయక చర్యలపై సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకో సీనియర్ అధికారిని నియమించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?