ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు – 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలునకు కేబినెట్ లో నిర్ణయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఈ ఏడాది విద్యా కానుక పంపిణీకి, కొత్త డీఏ అమలునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల్లో 706 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్ కు 28 ఎకరాల భూమిని లీజ్ ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపి పౌర సరఫరాల కార్పోరేషన్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణ కు మంత్రివర్గం అమోదం తెలిపింది.