AP Cabinet Meet: నేడు ఏపి కేబినెట్ భేటీ

Share

AP Cabinet Meet: ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహన రెడ్డి YS Jagan mohan reddy అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనున్నది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రిమండలి సమావేశం ఉదయం 11.30 గంటలకు అవుతుంది. గత నెల 22 వ తేదీ, ఆ తరువాత 29 వ తేదీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మంత్రి మండలి సమావేశాలు వాయిదా వేయడంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు సైతం గుప్పించారు. కరోనాకు భయపడి కేబినెట్ భేటీలను అయితే వాయిదా వేసుకున్నారు కానీ టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందంటూ విమర్శించారు. దీంతో రెండు సార్లు కేబినెట్ భేటీ వాయిదా పడినా ఈ రోజు మాత్రం తప్పకుండా మంత్రి మండలి సమావేశం అవుతుందని భావిస్తున్నారు.

AP Cabinet Meet
AP Cabinet Meet

ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నది. ఎలక్ట్రానిక్ పాలసీతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలునకు అవగాహన ఒప్పందం చేసుకోవడం, రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పై తీసుకుంటున్న చర్యలు, కర్ఫ్యూ తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా విశాఖపట్నంలో కైలాసగిరి నుండి భోగాపురం విమానాశ్రయం వరకూ పర్యాటక ప్రాజెక్టులుగా రాష్ట అతిధి గృహాలు నిర్మించాలన్న ప్రతిపాదన మంత్రి మండలి ముందుకు రానున్నది. ఇలాంటి ప్రాజెక్టులు సుమారు ఎనిమిది ఉన్నాయి. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో లే అవుట్లకు సంబంధించి భూమి రిజిస్ట్రేషన్ విలువలో అయిదు శాతం మేర జగనన్న కాలనీలకు కేటాయించేలా రూపొందించిన ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం ఉంది. రెండు సార్లు వాయిదా అనంతరం జరుగుతున్న ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Share

Related posts

ట్రంప్ స‌ర్కారుపై న్యాయ‌పోరాటానికి దిగుతున్న టిక్‌టాక్ ఉద్యోగులు..!

Srikanth A

మరో నలుగురు

somaraju sharma

ఒక్కటే స్కామ్.. సచిన్, నయనతార, రమ్యకృష్ణ అంతా ఇరుక్కున్నారు..? మన హైదరాబాదే కేంద్రం

arun kanna