NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా..ఎందుకంటే..?

AP Cabinet Meet: ఈ నెల 3వ తేదీ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశాన్ని తిరిగి మార్చి 7వ తేదీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సంబంధించి మార్పులను గమనించాల్సిందిగా అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు జారీ చేసింది. 3వ తేదీ దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పెద్ద కర్మ ఉండటంతో..కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

AP Cabinet Meet Postponed to 7th march
AP Cabinet Meet Postponed to 7th march

AP Cabinet Meet: 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు

మంత్రి గౌతమ్ రెడ్డి మరణానికి ముందే మార్చి 3వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డి ఫిబ్రవరి 21న గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత మంత్రి మృతికి సంతాపంగా ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఫిబ్రవరి 23న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిశాయి. కాగా మార్చి 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై..?

ఈ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు కీలక అంశాలపై  చర్చించి ఆమోదం తెలుపనుంది. ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుతో నూతన జిల్లాల ఏర్పాటు తదితర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి 7వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల గురించి వివరించి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సోమవారం సీఎం జగన్ దంపతులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N