AP Cabinet: ప్రమాణ స్వీకారంలో ప్రత్యేకత చాటుకున్న ఆ ముగ్గురు మంత్రులు

Share

AP Cabinet: ఏపిలో కొత్త మంత్రులు కొలువుతీరారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులు గ్రూపు ఫోటో దిగారు. ఆ తరువాత సచివాలయంలో గవర్నర్, సీఎం సీఎం జగన్, కొత్త, పాత మంత్రులు అధికారులు టీ పార్టీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముగ్గురు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేసి ప్రత్యేకంగా నిలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఉష శ్రీ చరణ్ లు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేయగా, మిగిలిన వారందరూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

AP Cabinet swearing ceremony

AP Cabinet: ముందుగా అంబటి

వరుసగా అంబటి రాంబాబు, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ. బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్థన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్ట సత్యనారాయణ, నారాయణ స్వామి, ఉషా శ్రీ చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పి రాజన్నదొర, ఆర్కే రోజా, తానేటి వనిత, సీదీరి అప్పలరాజు, విడతల రజని మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆల్పాబీటికల్ ప్రకారం మొదట అంబటి రాంబాబు, లాస్ట్ లో విడతల రజని ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. మీడియా ముందు తమ సంతోషాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కొందరు సీఎం జగన్ పాదాలకు నమస్కరించి తమ విధేయతను చాటుకున్నారు. రోజా జగన్ పాదాలకు నమస్కరించి చేతులు ముద్దాడి వెళ్లారు.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

20 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

44 mins ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

3 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago