NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధాని అమరావతిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ

అమరావతి రాజధాని అంశంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు తీర్పు ఇంతకు ముందు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపి ప్రభుత్వం వాదిస్తొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరింది.

 

AP Capital Amaravati will be heard in Supreme Court Tomorrow
AP Capital Amaravati will be heard in Supreme Court Tomorrow

 

సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమే అని ఏపి ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల కాన్సెప్ట్ చేసినట్లు చెప్పింది. ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. మరో పక్క ఈ కేసులో తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ అమరావతి రైతులు సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎస్ఎల్పీ పై త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కు లేఖ రాయడంతో నవంబర్ 1వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

విశాఖ నుండి త్వరలో పరిపాలనా ప్రారంభం అవుతుందని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూడు రాజధానులు చేసి తీరుతామని పలువురు మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చెబుతూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఓ ప్రముఖ జాతీయ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడు రాజధానుల వ్యవహారంపై తేల్చి చెప్పారు. అన్నీ ఆలోచించే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని స్పష్టం చేశారు. సీఎం ఎక్కడ నుండి పరిపాలన చేస్తే అక్కడే మంత్రులు ఉంటారని, అక్కడే సచివాలయం ఉంటుందని తేల్చి చెప్పారు. సీఎం ఎక్కడ ఉండి పాలన చేయాలి అనేదానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని జగన్ ప్రశ్నించారు. విశాఖ పరిపాలనా రాజధాని అంశంపై ప్రభుత్వం, వైసీపీ నేతలు స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేస్తుండటంతో సుప్రీం కోర్టులో.. హైకోర్టు తీర్పుపైన స్టే వస్తుందా .. లేక విచారణ వాయిదా పడుతుందా..అనే దానిపై రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju