NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital Issue: తీర్పు ఊహించిందే..మా ఆలోచన విధానంలో మార్పు లేదంటూ మంత్రి బొత్స సంచలన కామెంట్స్

AP Capital Issue: ఏపి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపి హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైశ శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు ఊహించిందేనని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ అనేది తమ ప్రభుత్వ విధానం అని దానిలో ఏటువంటి మార్పు ఆలోచన లేదని మరో సారి స్పష్టం చేశారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయాన్ని పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారని అన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం కాదని ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

AP Capital Issue Minister Botsa Satyanarayana comments
AP Capital Issue Minister Botsa Satyanarayana comments

AP Capital Issue: మూడు నెలల్లో ప్లాట్లు ఎలా ఇస్తారు..?

సీఆర్డీఏ చట్టం అమలునకు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్న ఆయన..మూడు నెలల్లో ప్లాట్లు ఎలా ఇస్తారు..? ఏదైనా ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా.? లేదా..? చూడాలన్నారు. హైకోర్టు తీర్పు పూర్తిగా చదివాక వీటిపై స్పందిస్తానని అన్నారు. హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదనీ, అయినప్పటికీ దానిపై చర్చించి చెబుతామన్నారు.

AP Capital Issue: మూడు రాజధానులు ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యం

రాజ్యాంగపరంగా చట్టపరిధిలో చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ విధానమనీ, మూడు రాజధానుల ఏర్పాటునకు ఈ క్షణం వరకూ నిబద్ధతతో ఉన్నామని బొత్స పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు చూసిన తరువాత పూర్తి స్థాయిలో దీనిపై మాట్లాడతానని మంత్రి బొత్సా వెల్లడించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!