ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capitals Issue: రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్ ..! ఆ విషయంపై డిసెంబర్ 27న క్లారిటీ..?

Share

AP Capitals Issue: తాను ఒకటి తలస్తే దైవం మరొకటి తలచినట్లుగా ఉన్నది ఏపి ప్రభుత్వ పరిస్థితి. రాజధానుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుకున్నది ఏపి హైకోర్టులో జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకుంటే హైకోర్టులో ఇక రాజధాని కేసులు ఉపసంహరణ అవుతాయనీ, హైకోర్టు కూడా ఆ కేసుల విచారణను నిలుపుదల చేస్తుందని జగన్ సర్కార్ భావించినట్లు ఉంది. అందుకే ప్రభుత్వ న్యాయవాది, అడ్వొకేట్ జనరల్ ఇదే విషయాన్ని కోర్టుకు వివరించారు. మూడు రాజధానులకు సంబంధించి సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకణ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నదని కోర్టుకు విన్న విన్నవించారు. అయితే అసెంబ్లీలో, మండలిలో మూడు రాజధానులకు సంబంధించి బిల్లుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయినా ఇంకా గవర్నర్ ఆమోదం గెటిజ్ ప్రకటన రానందున హైకోర్టు కేసు విచారణను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదే క్రమంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు తొలగించింది. కార్యాలయాల తరలింపు విషయంపై స్టే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

AP Capitals Issue: బిల్లులు ఉపసంహరించుకున్నా..

అయితే రాజధానుల కేసుల విషయంలో న్యాయవాదులు పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్ లలో సీ ఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకణ బిల్లులకు వ్యతిరేకంగానే కాక అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ, సీఆర్డీఏ ఒప్పందాలు అమలు అయ్యేలా చూడాలని, అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు కొనసాగించాలి ఇలా అనేక అంశాలు కూడా పిటిషన్లలో ఉన్నాయనీ, అందుకు ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నప్పటికీ అసెంబ్లీలో మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నామనీ, త్వరలో మెరుగైన బిల్లు తీసుకువస్తామని చెప్పినందున ఈ కేసుల విచారణను కొనసాగించాలని పిటిషన్ ల తరపున న్యాయవాదులు కొరుతున్నారు. దీనిపై డిసెంబర్ 27వ తేదీ విచారణలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Share

Related posts

Poll : స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ ఏకగ్రీవాలు ఏ పార్టీకి వ‌స్తాయ‌ని మీరు భావిస్తున్నారు..?

kavya N

తిరిగి సొంత గూటికి..

somaraju sharma

Cyclone Warning in AP: ఏపీకి తుఫాను ముప్పు..!!

sekhar